పాకిస్థాన్ బలూచిస్థాన్ రాష్ట్రంలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. బస్సు బోల్తాపడి 15 మంది మృతి చెందారు. మరో 10మంది గాయపడ్డారు. ఈ ఘటనలో మరణించినవారిలో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
బలూచిస్థాన్ నుంచి కరాచీ వెళ్తున్న బస్సు అదుపు తప్పి క్వెట్టా-కరాచీ రహదారిపై ఉతల్ టౌన్ వద్ద ప్రమాదానికి గురైంది. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: మంచు తుపాను బీభత్సం- వణుకుతోన్న అమెరికా