నేపాల్‌లో సైబర్ నేరాలకు పాల్పడిన 122 మంది చైనీయులను అదుపులోకి తీసుకున్నది నిజమేనని చైనా ఒప్పుకుంది. నేరగాళ్లను చైనా భద్రత అధికారుల భాగస్వామ్యంతో నేపాల్ పోలీసులు పట్టుకున్నట్లు తెలిపింది.
కాఠ్మాండు సరిహద్దులోని పలు ఇళ్లుపై సోదా చేసి...500కు పైగా ల్యాప్‌టాప్స్‌ను స్వాధీనం చేసుకున్నారు నేపాల్ పోలీసులు. బ్యాంకు నగదు లావాదేవీలు జరిపే యంత్రాలను హ్యాక్ చేసి ఆర్థిక నేరాలకు పాల్పుడుతున్నట్లుగా పోలీస్ అధికారులు తెలిపారు.
చైనా- నేపాల్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జెంగ్ సుయాంగ్ మీడియాకు వెల్లడించారు.
"సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రతలు, సైబర్ నేరాలు అదుపు చేసేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయి."
-జెంగ్ శుయాంగ్, చైనా విదేశాంగ్ శాఖ ప్రతినిధి.
గత నెల సెప్టెంబరులో కాఠ్మాండులో ఐదుగురు చైనీయులు అక్రమంగా క్లోన్ డెబిట్ కార్డుల ద్వారా లక్షల్లో నగదును ఉపసంహరించుకున్నందుకు అరెస్టు అయ్యారు. వారి దగ్గర నుంచి 132 ఫోర్జరి వీసా డెబిట్ కార్డులు, 17 అథెంటిక్ వీసా కార్టులు, 6 మోబైల్ ఫోన్లు, ఓ డేటా కార్డు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి : సీడీఎస్, ఎన్పీఆర్కు కేంద్ర కేబినెట్ పచ్చజెండా