చైనాలోని జజైయాంగ్ రాష్ట్రంలో పడవ బోల్తా పడి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు సురక్షితంగా బయటపడగా మరో నలుగురు గల్లంతయ్యారని సమాచారం. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
మొత్తం 20 మంది ప్రయాణిస్తున్న ఈ బోటు ఆదివారం తెల్లవారుజామున 4.28 గంటలకు బోల్తా పడినట్లు తమకు సమాచారం అందిందని సహాయక బృందాలు వెల్లడించాయి.
ఇదీ చదవండి : ఓడ, పడవ ఢీ- 17 మంది గల్లంతు