బంగ్లాదేశ్‌లో లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతోంది. కరోనా మహమ్మారి దేశంలో ఉద్ధృతంగా వ్యాపిస్తున్నా... ప్రజలు మాత్రం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు.
బ్రాహ్మణబరియాలో ఓ ఇస్లామిక్ మత బోధకుడి అంత్య క్రియలకు వేలాది మంది హాజరయ్యారు. వీరిని నిలువరించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది.
బంగ్లాదేశ్‌లో తాజాగా 9 మంది కరోనాతో మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 91కి చేరింది. మరోవైపు కొత్తగా 312 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 2,458కి పెరిగింది. పరిస్థితుల తీవ్రత దృష్ట్యా కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు... బంగ్లాదేశ్‌లో ఏప్రిల్ 25 వరకు లాక్డౌన్ విధించారు.
ఇదీ చూడండి: ఇమ్రాన్‌ఖాన్ చెత్త వ్యాఖ్యలను తిప్పికొట్టిన భారత్