చైనా షాండాంగ్ బంగారు గని ప్రమాదంలో 10 మంది కార్మికులు చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. ఇంకో వ్యక్తి ఆచూకీ లభించలేదని వెల్లడించారు. ప్రమాదం జరిగిన క్రమంలో రెండు వారాల పాటు కార్మికులు గనిలోనే చిక్కుపోయినట్లు తెలిపారు.
చైనాలోని షాండాంగ్ బంగారు గనిలో ఈ నెల 10న పేలుడు జరిగింది. ఆ సమయంలో 22 మంది కార్మికులు అక్కడే పని చేస్తున్నారు. 11 మందిని భద్రతా సిబ్బంది కాపాడారు. కాగా మరో 11 మంది గనిలో చిక్కుకుపోగా వారిని కాపాడేందుకు 633 మంది సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో చనిపోయిన 10 మంది మృత దేహాలను సోమవారం వెలికి తీశారు.
ఇదీ చూడండి: చైనా గని ప్రమాదంలో మరో ఇద్దరు సురక్షితం