పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో విషాదం జరిగింది. 25 మందితో ప్రయాణిస్తున్న ఓ బస్సు అదుపుతప్పి నది ఒడ్డున లోయలో పడిన ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది గాయపడ్డారు.
ముజఫరాబాద్‌కు 24 కి.మీ.ల దూరంలోని జమీనాబాద్ గ్రామం వద్ద జీలమ్ నది ఒడ్డున ముజఫరాబాద్-కోహాలా రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. రావల్పిండి నుంచి చకోథికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని చెప్పారు.
ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు.
ఇదీ చూడండి: బడి ప్రాంగణంలో 215 అస్థిపంజరాలు
ఇదీ చూడండి: అంతరిక్ష కేంద్రానికి సరకులతో చైనా వ్యోమనౌక పయనం