ETV Bharat / international

'స్పెల్లింగ్​ బీ' విజేతగా జైలా​.. రన్నరప్​గా తెలుగమ్మాయి - స్పెల్లింగ్​ బీ 2021

spelling bee 2021
'స్పెల్లింగ్​ బీ' విజేతగా జైలా అవంత్​
author img

By

Published : Jul 9, 2021, 8:03 AM IST

Updated : Jul 9, 2021, 12:19 PM IST

07:59 July 09

'స్పెల్లింగ్​ బీ' విజేతగా జైలా అవంత్​

spelling bee 2021
ట్రోఫీతో జైలా అవంత్​

ప్రతిష్ఠాత్మక 'స్పెల్లింగ్ బీ' పోటీల్లో ఆఫ్రికన్ అమెరికన్​ జైలా అవంత్​ గార్డె ఛాంపియన్​గా నిలిచారు. 14 ఏళ్ల జైలా.. ఈ ఘనత సాధించిన తొలి ఆఫ్రికన్​ అమెరికన్​గా రికార్డు సాధించారు. అంతేకాదు.. ఈ పోటీల 96 ఏళ్ల చరిత్రలో ఛాంపియన్​గా నిలిచిన రెండవ నల్లజాతీయురాలిగా ఘనత పొందారు. 1998లో జోడి అన్నీ మ్యాక్స్​వెల్​ అనే విద్యార్థి.. 'స్పెల్లింగ్ బీ' పోటీల్లో గెలుపొందిన తొలి నల్లజాతీయురాలిగా నిలిచారు. భారత సంతతికి చెందిన తెలుగమ్మాయి తుమ్మల చైత్ర రన్నరప్​గా నిలిచారు. 

అమెరికాలోని ఫోర్లిడా రాష్ట్రంలో లేక్​ బ్యూయేనా విస్టా వేదికగా స్పెల్లింగ్​ బీ పోటీలు జరిగాయి. నిర్వాహకులు విజేతకు 50వేల డాలర్ల ప్రైజ్​ మనీని అందించారు.  

గిన్నిస్​ రికార్డ్​..

బాస్కెట్​బాల్​ క్రీడాకారిణి అయిన జైలా.. మూడు గిన్నిస్​ రికార్డులను సాధించారు. ఒకేసారి ఎక్కువ బంతులతో బాస్కెట్​బాల్​ ఆడినందుకుగానూ ఆమె ఈ ఘనతను పొందారు.  

మెరిసిన భారత సంతతి విద్యార్థులు..

గత కొన్నేళ్లగా 'స్పెల్లింగ్ బీ' పోటీల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న భారత సంతతి విద్యార్థులు ఈసారి కూడా రాణించారు. ఈ పోటీలో రెండు, మూడు స్థానాలను భారత సంతతి విద్యార్థులు చైత్ర తుమ్మల (12) , భావన మదిని (13) దక్కించుకున్నారు. ఈ ఫైనల్స్​లో పాల్గొన్న 11 మందిలో 9 మంది భారత సంతతికి చెందిన విద్యార్థులే ఉండటం విశేషం.    

1999 నుంచి ఇప్పటివరకు మొత్తం 26 మంది భారత సంతతి విద్యార్థులు విజేతలుగా నిలిచారు.  

ఈ కార్యక్రమానికి హాజరైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ సతీమణి జిల్​ బైడెన్​.. విజేత జైలా అవంత్​ను అభినందించారు.  

ఇదీ చూడండి : నాన్న బర్త్​డేకు ఇలాంటి కానుకా?

Last Updated : Jul 9, 2021, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.