ETV Bharat / international

పుడమి తల్లి కోసం ఉద్యమించిన 'యువ ప్రపంచం'

పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ ప్రపంచవ్యాప్తంగా యువత పోరుబాట పట్టింది. వేర్వేరు దేశాల్లో ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. వాతావరణాన్ని కాపాడకపోతే మానవ జాతి మనుగడే కనుమరుగవుతుందని ప్రభుత్వాలను హెచ్చరించింది.

పుడమి తల్లి కోసం ఉద్యమించిన 'యువ ప్రపంచం'
author img

By

Published : Sep 21, 2019, 3:18 PM IST

Updated : Oct 1, 2019, 11:27 AM IST

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాల యువతీయువకులు ఏకతాటిపైకి వచ్చారు. 'గ్లోబల్​ క్లైమెట్​ స్ట్రైక్​' పేరిట అంతర్జాతీయ స్థాయిలో ఉద్యమం చేపట్టారు. అమెరికా, బ్రెజిల్, ఫ్రాన్స్​, భారత్​, పాకిస్థాన్​ సహా అనేక దేశాల్లోని ప్రధాన నగరాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పెరుగుతున్న కాలుష్యం నుంచి భావితరాలను కాపాడాలని నినదించారు.

పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పుపై ప్రపంచ దేశాధినేతల దృష్టిని ఆకర్షించి, పరిష్కారం కోసం ఒత్తిడి తెచ్చే లక్ష్యంతో ఐరాస సర్వ సభ్య సమావేశానికి ముందు ఈ ఆందోళన చేపట్టారు యువతీయువకులు.

పుడమి తల్లి కోసం ఉద్యమించిన 'యువ ప్రపంచం'

అమెరికా

పర్యావరణ పరిరక్షణ కోసం యువత ఆందోళనలతో అమెరికాలోని ప్రధాన నగరాలు హోరెత్తాయి. న్యూయార్క్​, సాన్​ ఫ్రాన్సిస్కో, అట్లాంటాలో విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రభుత్వాలు తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

మెక్సికో

పర్యావరణాన్ని కాపాడకపోతే మానవ జాతి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని ప్లకార్డులు ప్రదర్శించారు మెక్సికన్​ వాసులు.

బ్రెజిల్​

అమెజాన్​ అడవుల్లో కార్చిచ్చు నేపథ్యంలో బ్రెజిల్​లో పర్యావరణ పరిరక్షణ ఉద్యమం తీవ్రస్థాయిలో జరిగింది. సావ్​ పౌలో నగరంలో వందల మంది ఆందోళనకు దిగారు.

పాకిస్థాన్

పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా వందలాది మంది నిరసనలు చేపట్టారు. కరాచీలో పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు.

పెరూ

పెరూ లిమా ప్రాంతంలో 'గ్లోబల్‌ క్లైమెట్‌ స్ట్రైక్‌' పేరిట ర్యాలీ చేపట్టారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం త్వరగా విధి విధానాలను రూపొందించాలని కోరారు. ఈ ర్యాలీలో లక్ష మందికి పైగా పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు

Chandigarh, Sep 21 (ANI): Haryana Chief Minister Manohar Lal Khattar on September 21 hailed and thanked Prime Minister Narendra Modi and Finance Minister N Sitharaman for cutting in corporation tax among a series of announcements. He said that the announcements made by the Finance Minister will ultimately increase the job opportunity in the country. On September 20, the Finance Minister made several announcements for the corporate sector in a press briefing. She announced cuts in corporation tax among a series of announcements. Sitharaman said the total revenue forgone on account of today's measures would be Rs 1.45 trillion per year.
Last Updated : Oct 1, 2019, 11:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.