బ్రెజిల్ రియో డి జెనీరో నగరంలో ఆఫ్రో-బ్రెజిల్‌కు చెందిన కాండోంబుల్, అంబాండా తెగ ప్రజలు.. సముద్ర రాణిగా పిలిచే యెమంజా దేవతకు పూజలు నిర్వహించారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కొపకబానా బీచ్‌లో వేడుకలు జరుపుకున్నారు. ఉత్సాహంగా పాటలు పాడుతూ, సంప్రదాయ నృత్యప్రదర్శనలు చేశారు.
తెల్లని దుస్తులు ధరించి, పూలు, కొవ్వొత్తులు, పండ్లు, కొన్ని రకాల పానీయాలు తీసుకొచ్చి సముద్ర దేవతకు పూజలు చేశారు. సముద్రపు నీటిని తలపై జల్లుకున్నారు. 2019 సంవత్సరంలో వారికి రక్షణ కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ... 2020లో తమ జాతి ప్రజల్లో శాంతి సౌభాగ్యాలు కలిగేలా చూడాలని దేవతను ప్రార్థించారు.
నిధుల కొరత...
ఉత్సవాలు జరపడానికి ప్రభుత్వం ఆర్థికంగా మద్దతు ఇవ్వకపోవడం వల్ల పండుగను ఘనంగా నిర్వహించలేకపోతున్నామని భక్తులు అసహనం వ్యక్తం చేశారు.
"ఈ పండుగకు నిధులు కేటాయించకపోవడం బాధాకరం. ఈ సమస్య గత ఏడాది కంటే మరి ఎక్కవైంది. కానీ ప్రతీ సంవత్సరం మేము ఇక్కడ వేడుకలు నిర్వహించి మా మత ఔన్నత్యాన్ని చాటుకుంటున్నాం. ఎంతో ప్రేమ, విశ్వాసంతో మా దేవతకు పూజలు చేసుకుంటున్నాం."
- రఫేల్ సెసరియో, భక్తుడు.
19వ శతాబ్దం ప్రారంభంలో పశ్చిమ ఆఫ్రికా బానిసల ద్వారా కాండొంబుల్ తెగ ప్రజలు బ్రెజిల్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఆఫ్రికా సంప్రదాయాలు, రోమన్ కేథలిక్ సంప్రదాయలను కలిపి పాటిస్తారు ఈ ఆఫ్రో-బ్రెజిల్ ప్రజలు.
ఇదీ చూడండీ: బ్రిటన్‌లో ప్రవాస భారతీయులకు అరుదైన గౌరవం