ప్రపంచ దేశాల్లో కరోనా మహావిలయం కొనసాగుతూనే ఉంది. రోజుకు 4 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8 కోట్ల మార్క్‌ను దాటింది. మరణాలు 17.5 లక్షలకు చేరింది. అమెరికాలో రోజుకు లక్ష కేసుల వరకు వస్తుండగా, బ్రిటన్, బ్రెజిల్, ఫ్రాన్స్, భారత్, రష్యా వంటి దేశాల్లో 20 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.
మొత్తం కేసులు: 80,207,155
మరణాలు: 1,757,640
కోలుకున్నవారు: 56,471,521
క్రియాశీల కేసులు: 21,977,994
- అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజుకు దాదాపు లక్ష మందికిపైగా కొత్తగా వైరస్ బారినపడుతున్నారు. శుక్రవారం 98 వేల మందికి వైరస్ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 1.92 కోట్లు దాటగా.. 1.12 కోట్ల మంది కోలుకున్నారు.
- అగ్రరాజ్యం తర్వాత యూకేలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 32,725 కొత్త కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసులు 22 లక్షలు దాటాయి. 70 వేల మంది మరణించారు.
- రష్యాలో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 29వేలకుపైగా మందికి వైరస్ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 30 లక్షలకు చేరువైంది. ఇప్పటి వరకు 53 వేల మంది మరణించారు.
- బ్రిటన్ తర్వాత భారత్, బ్రెజిల్, ఫ్రాన్స్, ఇటలీలలో 20 వేల వరకు కొత్త కేసులు వచ్చాయి. టర్కీ, జర్మనీ, కొలంబియా, మెక్సికో, ఉక్రెయిన్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో రోజుకు 10వేలకుపైగా కేసులు వస్తున్నాయి. ఉక్రెయిన్, పెరూలు 10 లక్షల మార్క్‌ను చేరుకున్నాయి. ఈ మైలురాయికి దక్షిణాఫ్రికా దగ్గరగా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వివరాలు ఇలా..
దేశం | మొత్తం కేసులు | మరణాలు |
అమెరికా | 19,210,166 | 338,263 |
బ్రెజిల్ | 7,448,560 | 190,515 |
రష్యా | 2,992,706 | 53,659 |
ఫ్రాన్స్ | 2,547,771 | 62,427 |
యూకే | 2,221,312 | 70,195 |
టర్కీ | 2,118,255 | 19,371 |
ఇటలీ | 2,028,354 | 71,359 |
స్పెయిన్ | 1,869,610 | 49,824 |