ETV Bharat / international

రికార్డ్​ స్థాయిలో కేసులు- ఒక్కరోజులో లక్షా 89 వేలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఒక్కరోజే 1,89,000 కొత్త కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికమని తెలిపింది.

worldwide corona virus
కోటికిపైగా బాధితులు, 5 లక్షలకుపైగా మృతులు
author img

By

Published : Jun 29, 2020, 7:39 AM IST

Updated : Jun 29, 2020, 9:59 AM IST

కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఆదివారం ఒక్కరోజే 1,89,000 కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) తెలిపింది. ఒక్కరోజులో నమోదైన కేసుల సంఖ్యలో ఇదే అత్యధికమని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1.02 కోట్లు దాటింది. మృతుల సంఖ్య 5 లక్షలకు పైనే ఉంది.

worldwide corona virus
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు

బ్రెజిల్​ రికార్డు..

బ్రెజిల్​లో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 46,800 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో అత్యధిక కేసుల నమోదులో అమెరికా (44,400) రికార్డును బ్రెజిల్​ దాటేసింది. బ్రెజిల్​, అమెరికా తర్వాత.. కొత్త కేసుల నమోదులో భారత్​ మూడో స్థానంలో ఉంది. భారత్​లో రోజుకు సుమారు 20 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది.

మళ్లీ విజృంభణ..

కేసులు, మరణాల సంఖ్యలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత బ్రెజిల్​, రష్యా, భారత్​లు ఉన్నాయి. వైరస్​ను కట్టడి చేయటంలో సఫలమైన చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఈ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది.

ఇదీ చూడండి: ఒక్కరోజులో 19,459 కేసులు, 380 మరణాలు

Last Updated : Jun 29, 2020, 9:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.