ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 30 కోట్లకు కేసులు.. ఒక్కరోజే 25లక్షల మందికి కరోనా

worldwide covid cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మొత్తం బాధితుల సంఖ్య 30 కోట్లు దాటింది. గురువారం ఒక్కరోజే దాదాపు 25 లక్షల కేసులు వచ్చాయి. అమెరికా, ఫ్రాన్స్​, ఇటలీ, భారత్​, అర్జెంటీనా వంటి దేశాల్లో వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉంది.

worldwide corona cases
ప్రపంచవ్యాప్తంగా 30 కోట్లకు కరోనా కేసులు
author img

By

Published : Jan 7, 2022, 9:22 AM IST

worldwide covid cases: కరోనా.. ముడేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. రూపాలు మారుస్తూ తన ప్రతాపాన్ని చూపిస్తూ లక్షల మందిని బలితీసుకుంటోంది. కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​​ విజృభణతో దాదాపు అన్ని దేశాల్లో వైరస్​ బారినపడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 24,97,154 మందికి వైరస్​ సోకింది. 6,834 మంది బలయ్యారు. 6.89 లక్షల మంది వైరస్​ను జయించారు. మొత్తం మరణాల సంఖ్య 54,89,506కు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా వైరస్​ ఉద్ధృతి కొనసాగుతున్న దేశాలు ఇలా..

  1. అమెరికాలో వైరస్​ విలయం కొనసాగుతోంది. గురువారం మరో 7,51,512 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. 2,143 మంది చనిపోయారు. 89వేల మంది వైరస్​ను జయించారు. మొత్తం కేసుల సంఖ్య 59,564,116కు, మరణాలు 8,55,843కు చేరాయి. ఒమిక్రాన్​ వేరియంట్​ కేసులే 95 శాతం మేర ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త కేసులతో ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం లక్షకుపైగా చికిత్సపొందుతున్నట్లు అంచనా.
  2. ఫ్రాన్​లో ఒమిక్రాన్​ సహా మరో కొత్త వేరియంట్ వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. డెల్టా, ఒమిక్రాన్​ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజే 2,61,481 కేసులు బయటపడ్డాయి. 204 మంది మరణించారు. 57వేల మంది వైరస్​ను జయించగా.. మొత్త కేసులు 11,183,238, మరణాలు 1,25,013కు చేరాయి.
  3. ఇటలీలో గురువారం కొత్తగా 2.19 లక్షల కేసులు వచ్చాయి. 198 మంది ప్రాణాలు కోల్పోయారు. 46వేల మంది వైరస్​ నుంచి కోలుకోగా.. మొత్తం కేసుల సంఖ్య 69, 75,465కు చేరింది. మొత్తం 1,14, 207 మంది మరణించారు.
  4. బ్రిటన్​లోనూ కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గురువారం 1,79,756 మందికి వైరస్​ సోకింది. 231 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 1.40 లక్షలు దాటింది.
  5. అర్జెంటీనాలో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 1,09,608 కేసులు బయటపడ్డాయి. 40 మంది ప్రాణాలు కోల్పోయారు. 36వేల మంది కోలుకోగా.. మొత్తం కేసుల సంఖ్య 6,025,303కు చేరింది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.