అది ప్రపంచంలోనే పురాతన విస్కీ బాటిల్. 1850లో తయారైంది . ఇక అందులో నింపిన విస్కీ అంతకంటే ఒక పది సంవత్సరాల ముందుది.! ఆనాటి బాటిల్ నేడు వేలానికి వచ్చింది. అనుకున్నదానికన్నా ఆరు రెట్లు అధిక ధర పలికింది. సుమారు కోటి రూపాయలకు అమ్ముడైన ఈ బాటిల్ కథ మీకోసం..
లండన్‌లో నిర్వహించిన వేలం పాటలో ఏకంగా రూ.కోటి ధర పలికిన ఈ విస్కీ.. ప్రముఖ ఆర్థికవేత్త జేపీ.మోర్గాన్‌కు చెందినదని వేలం నిర్వాహకులు తెలిపారు. ఆయన గదిలో దొరికిన మూడు సీసాల్లో మిగిలి ఉన్న ఏకైక బాటిల్ ఇదే కావడం విశేషం. బాటిల్ వెనుక ఉన్న లేబుల్‌ను బట్టి ఇది 1865కి ముందే తయారైనట్లు నిపుణులు చెబుతున్నారు. స్కిన్నర్ ఇంక్ అనే సంస్థ నిర్వహించిన వేలంలో అధిక ధరకు అమ్ముడై.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డు సృష్టించింది ఈ విస్కీ బాటిల్.
మొదట ఈ బాటిల్‌కు 20-40 వేల డాలర్ల మధ్య ధర లభిస్తుందని వేలం నిర్వహించిన 'స్కిన్నర్ ఇంక్' అంచనా వేసింది. జూన్ 30న ముగిసిన వేలంలో అమెరికా మాన్‌హట్టన్‌లోని 'ది మోర్గాన్ లైబ్రరీ' అనూహ్యంగా 1,37,500 డాలర్లు (రూ.కోటి)కు దక్కించుకుంది.
తాగేస్తారా?
విస్కీ సుమారు 10 సంవత్సరాల వరకే నిల్వ ఉంటుందని.. దాదాపు రెండున్నర శతాబ్దాల నాటి ఈ విస్కీ ఇప్పుడు తాగేందుకు అవకాశం లేదని వేలంలో బాటిల్‌ను దక్కించుకున్న సంస్థ ప్రతినిధులు తెలిపారు. 1900లో జార్జియా పర్యటన సందర్భంగా జేపీ మోర్గాన్ ఈ బాటిల్‌ను కొన్నాడు. అనంతరం తన కొడుకుల నుంచి.. 1942-44 మధ్య దక్షిణ కరోలినా గవర్నర్ జేమ్స్ బైర్నెస్‌కు చేరింది. అక్కడి నుంచి చేతులు మారుతూ.. 'మోర్గాన్ లైబ్రరీ'కే వచ్చి చేరింది.
1770లలో సంభవించిన విప్లవాత్మక మార్పులు, యుద్ధ పరిస్థితుల్లో విస్కీని తయారు చేయడం మొదలుపెట్టారని ప్రతీతి.
ఇదీ చదవండి: