ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 4.5కోట్లకు చేరువైన కరోనా కేసులు

కరోనా మహమ్మారి విలయంలో ప్రపంచదేశాలు విలవిల్లాడుతున్నాయి. వైరస్​ విజృంభణతో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. మొత్తం బాధితుల సంఖ్య 4.47కోట్లు దాటింది. 11.78లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో వైరస్​ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అటు బ్రెజిల్​, రష్యాలోనూ మహమ్మారి బాధితుల  సంఖ్య స్థిరంగా పెరుగుతూనే ఉంది.

WORLD WIDE CORONA CASES UPDATES
ప్రపంచవ్యాప్తంగా 4.5 కోట్లకు చేరువైన కరోనా కేసులు
author img

By

Published : Oct 29, 2020, 9:49 AM IST

ప్రపంచంపై కరోనా రక్కసి కోరలు చాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 4కోట్ల 47లక్షల మందికిపైగా వైరస్​ బారిన పడ్డారు. వారిలో 11లక్షల 78వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ బారినపడిన వారిలో 3కోట్ల 27లక్షల మంది కోలుకున్నారు. 1.08 కోట్ల యాక్టివ్​ కేసులు నమోదయ్యాయి.

  • కరోనా కేసుల పరంగా తొలి స్థానంలో ఉన్న అమెరికాలో బుధవారం ఒక్కరోజే 81,581 మందికి వైరస్​ సోకింది. బాధితుల సంఖ్య 91లక్షల 20వేల 751కి చేరింది.
  • బ్రెజిల్​లో వైరస్​ ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. మరో 28వేలకుపైగా ​పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 54లక్షల 69వేలు దాటింది.
  • దక్షిణాఫ్రికాలోనూ వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. మరో 1,863 కొవిడ్​ కేసులు వెలుగుచూడగా.. బాధితుల సంఖ్య 7.19 లక్షలకు ఎగబాకింది. ఆ దేశంలో ఇప్పటివరకు 19,111 మంది కరోనాతో మృతిచెందారు. దక్షిణాఫ్రికాలో కొవిడ్​ వ్యాప్తి నేపథ్యంలో ఆ అధ్యక్షుడు సిరిల్​ రమఫొసా స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. జొహెన్స్​బర్గ్​లో ఇటీవల జరిగిన ఓ విందు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అక్కడ 35 మందిని కలిశారు. వారికి వైరస్​ సోకడం వల్లే.. తాను కూడా నిర్బంధంలోకి వెళ్తున్నట్టు చెప్పారు రమఫొసా.
  • బ్రిటన్​లో ఒక్కరోజులోనే 24,701 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. కేసుల సంఖ్య 9లక్షల 42వేల 275కు ఎగబాకింది.
  • కెనడాలో కరోనా కేసుల సంఖ్య 2.24 లక్షలు దాటింది. ఇప్పటివరకు అక్కడ 10,026 మంది వైరస్​కు బలయ్యారు.
  • ఇరాన్​లో బుధవారం ఒక్కరోజే 6వేలకుపైగా కరోనా కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 5.88 లక్షలు దాటింది. మరో 415 మంది మృతితో.. మరణాల సంఖ్య 33,714కు పెరిగింది.

ఇదీ చదవండి- కటకటాల్లోకి సెక్స్​ గురు- 120 ఏళ్ల జైలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.