ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 2.86కోట్లకు చేరిన కొవిడ్​ కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు మొత్తం బాధితుల సంఖ్య 2కోట్ల 86లక్షలు దాటింది. 9లక్షల 20వేల కుపైగా మరణాలు నమోదయ్యాయి.

WORLD WIDE CORONA CASES
ప్రపంచవ్యాప్తంగా 2.86కోట్లకు చేరిన కొవిడ్​ కేసులు
author img

By

Published : Sep 12, 2020, 6:07 PM IST

Updated : Sep 12, 2020, 6:50 PM IST

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు సుమారు 2కోట్ల 86 లక్షల మందికి కరోనా సోకింది. 9లక్షల 20వేల మందికిపైగా మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు. 20.6 లక్షల మందికిపైగా కొవిడ్​ను జయించగా.. ప్రస్తుతం 71.65 లక్షల యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

  • కొవిడ్​ కేసుల పరంగా ప్రపంచంలోనే తొలిస్థానంలో ఉన్న అమెరికాలో ఇప్పటివరకు 66.37 లక్షల పాజిటివ్​ కేసులు వెలుగుచూశాయి. 1.97 లక్షల మంది వైరస్​ కారణంగా మృతిచెందారు.
  • బ్రెజిల్​లో ఇప్పటివరకు 42.83 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 77వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
  • పాక్​లో కొత్తగా 584 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. దీంతో బాధితుల సంఖ్య 3లక్షల 955కు చేరింది. ఇప్పటివరకు అక్కడ 6,373 మంది మరణించారు
  • నేపాల్​లో మరో 336 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. మొత్తం కేసుల సంఖ్య 53,120కు చేరింది. కరోనా బారినపడిన వారిలో ఇప్పటివరకు అక్కడ 322 మంది మరణించారు.
  • దక్షిణ కొరియాలో 136 మందికి వైరస్​ సోకగా.. కేసుల సంఖ్య 22వేల మార్కు దాటింది. తాజాగా అయిదుగురు ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య 355కు ఎగబాకింది.
  • సింగపుర్​లో తాజాగా 42 కరోనా కేసులు వెలుగుచూశాయి. మొత్తం బాధితుల సంఖ్య 57,357కు పెరిగింది. ఇప్పటివరకు 27 మంది వైరస్​తో చనిపోయారు.

ఇదీ చదవండి: కరోనాపై ఐరాస తీర్మానానికి భారత్​ సహా 168 దేశాల మద్దతు

Last Updated : Sep 12, 2020, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.