ETV Bharat / international

'కరోనా సంక్షోభానికి ఇది ఆరంభం మాత్రమే!'

కరోనా వైరస్​తో ప్రపంచం గడగడలాడుతోంది. అనేక దేశాలు వైరస్​పై యుద్ధం ప్రకటించాయి. మూడు నెలలుగా ప్రపంచాన్ని కుదిపేస్తోంది ఈ మహమ్మారి. అయితే.. ఇది ఆరంభం మాత్రమేనని, ముందు ముందు పరిస్థితులు చాలా దారుణంగా మారతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

World walls off as leaders warn viral pandemic will worsen
'కరోనా సంక్షోభానికి ఇది ఆరంభం మాత్రమే!'
author img

By

Published : Mar 12, 2020, 5:08 PM IST

పాఠశాలల మూసివేత, నగరాల నిర్బంధం, కుప్పుకూలుతున్న స్టాక్​ మార్కెట్లు, క్రీడా టోర్నీల రద్దు, పర్యటనలపై నిషేధం, ఆసుపత్రుల్లో గంటగంటకు పెరుగుతున్న రోగుల సంఖ్య... ఇవి ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్​ వల్ల నెలకొన్న పరిస్థితులు. ఒక్క మాటలో చెప్పాలంటే.. వైరస్​తో ప్రపంచం స్తంభించిపోయింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​).. 'అంతర్జాతీయ మహమ్మారి'గా పేర్కొంది. అయితే ఇది కేవలం ఆరంభమేనా?

మరింత దారుణ పరిస్థితులు!

చైనాలో మూడు నెలల క్రితం పుట్టిన కరోనా వైరస్​.. సరిహద్దులను చెరుపుకుని దాదాపు అన్ని ఖండాలను తాకింది. ఉన్నతస్థాయి అధికారుల నుంచి.. హాలీవుడ్​ దిగ్గజ నటుల వరకు.. అందరికీ వైరస్​ సోకడం ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది.

అగ్రరాజ్యం అమెరికాలో వైరస్​ ప్రభావం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఇన్ని రోజులు కరోనాను తేలికగా తీసుకున్న ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. ఒక్కసారిగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అగ్రరాజ్యంలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా.. ఐరోపాకు రాకపోకలను నిలిపివేశారు. ట్రంప్​ ప్రకటనతో ముడిచమురు ధర మరింత క్షీణించింది. స్టాక్​ మార్కెట్ల పతనం కొనసాగింది.

పరిస్థితులు మరింత దారుణంగా మారే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

"మున్ముందు మరిన్ని కరోనా కేసులు చూస్తాం. పరిస్థితులు మరింత దారుణంగా మారతాయి."

-- డా. ఆంటోనీ ఫౌసి, యూఎస్​ నేషనల్​ ఇన్స్​టిట్యూట్​ ఆఫ్​ అల్లర్జీ- ఇన్ఫెక్షియస్​ డిసీసెస్​.

"ఈ ప్రమాదకర వ్యాధి.. ఓ భారీ భూకంపంతో సమానం. భారీ భూకంపం ప్రభావం మన జీవితాలపై అనేక వారాలుంటుంది. ఇదీ అంతే."

-- డా. జెఫ్​ డషిన్​, అమెరికా ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి.

కరోనాను తొలిసారి గుర్తించింది చైనాలోని వుహాన్​ నగరంలో. అయితే ఇది ఎలా పుట్టింది అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. అన్ని ఊహాగానాలే. వ్యాధి నివారణకు ఔషధాలు కూడా లేవు. మరి దీనికి ముగింపు ఎప్పుడు, ఎలా లభిస్తుందనే ప్రశ్నలు.. పరిశోధకులతో సహా యావత్​ ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి.

ఇదీ చూడండి:- ట్రంప్​తోపాటు ఆ దేశాధినేతకూ కరోనా ముప్పు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.