ETV Bharat / international

'హైడ్రాక్సీ' పరీక్షల​కు డబ్ల్యూహెచ్​ఓ అంగీకారం

author img

By

Published : Jun 3, 2020, 10:24 PM IST

Updated : Jun 3, 2020, 11:02 PM IST

హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్రయల్స్​ను పునరుద్ధరిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ డ్రగ్​తో సైడ్​ ఎఫెక్ట్స్​ ఉన్నాయని పలు అధ్యయనాలు చెప్పిన కారణంగా.. ట్రయల్స్​ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు గత నెలలో ప్రకటించింది డబ్ల్యూహెచ్​ఓ.

World Health Organization  says hydroxychloroquine coronavirus trials to resume
హైడ్రాక్సీక్లోరోక్వీన్​ ట్రయల్స్​కు డబ్ల్యూహెచ్​ఓ ఓకే

హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్రయల్స్​ను పునరుద్ధరిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) ప్రకటించింది. భద్రతాపరమైన డేటాను సమీక్షించిన అనంతరం.. ప్రణాళిక ప్రకారం ట్రయల్స్​ కొనసాగించవచ్చని నిపుణులు తెలిపినట్టు డబ్ల్యూహెచ్​ఓ స్పష్టం చేసింది.

" హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధం మీద అందుబాటులో ఉన్న మొత్తం డేటాను డబ్ల్యూహెచ్​ఓ భద్రతా పర్యవేక్షణ కమిటీ పరీక్షించింది. ట్రయల్స్​లో మార్పులు చేయాల్సిన అవసరం లేదని కమిటీ స్పష్టం చేసింది. ప్రణాళిక ప్రకారం ట్రయల్స్​ కొనసాగించవచ్చని పేర్కొంది."

--- టెడ్రోస్​ అథనోమ్​, డబ్ల్యూహెచ్​ఓ డైరక్టర్​.

ఫలితంగా.. ఇకపై అధ్యయనాల కోసం వైద్యులు రోగులకు ఈ మందును అందించనున్నారు.

హైడ్రాక్సీక్లోరోక్విన్​తో వైరస్​ నయమవుతుందని అనేక వార్తలు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ దీనిపై విస్తృతంగా ప్రచారం చేశారు. వైరస్​పై పోరులో ఈ డ్రగ్​ ఓ గేమ్​ఛేంజర్​గా మారనుందని అనేక మార్లు పేర్కొన్నారు. అయితే హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడటం వల్ల.. కరోనా రోగికి వ్యాధి నయంకాక పోగా.. గుండెజబ్బు వంటి ఇతర సైడ్​ ఎఫెక్ట్స్​ వచ్చే అవకాశం ఉందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో గత నెలలో.. హైడ్రాక్సీక్లోరోక్విన్​ ట్రయల్స్​ను.. కరోనా చికిత్స కోసం జరుగుతున్న అధ్యయనాల నుంచి తాత్కాలికంగా తొలగించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

Last Updated : Jun 3, 2020, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.