కొవిడ్-19 (కరోనా) వైరస్ను ఎదుర్కోవడంలో నిర్లక్ష్యం ఏ మాత్రం తగదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. పలు దేశాలు తాజా సంక్షోభాన్ని తీవ్రంగా పరిగణించడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది.
కరోనాను అడ్డుకునేందుకు పటిష్ఠ చర్యులు తీసుకోవాలని పిలుపునిచ్చింది. వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు ఐరోపా దేశాలతో పాటు అమెరికా ఆస్పత్రుల సన్నద్ధత సరిగా లేదంటూ నివేదికలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ అధినేత టెడ్రోస్ అధానోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. పేద, ధనిక అనే తేడాలేకుండా అన్ని దేశాలకు కరోనా ముప్పేనని పేర్కొన్నారు.
- ఇదీ చూడండి: వర్ధంతి కార్యక్రమంలో కాల్పుల కలకలం-27 మంది మృతి