ETV Bharat / international

'గల్ఫ్​లో మరోయుద్ధాన్ని ప్రపంచం భరించలేదు' - latest khasim suleman died news

అమెరికా డ్రోన్​ దాడుల్లో ఇరాన్​ మిలటరీ కమాండర్​ ఖాసీం సులేమానీ మృతిపై ఐరాస స్పందించింది. గల్ఫ్​ దేశాల్లో మరో యుద్ధాన్ని ప్రపంచం భరించలేదని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​ తెలిపారు.

World cannot afford another war in Gulf: UN chief Guterres
'గల్ఫ్​లో మరోయుద్ధాన్ని ప్రపంచం భరించలేదు'
author img

By

Published : Jan 4, 2020, 5:10 AM IST

Updated : Jan 4, 2020, 7:24 AM IST

అమెరికా జరిపిన డ్రోన్​ దాడుల్లో ఇరాన్​ మిలటరీ కమాండర్​ ఖాసీం సులేమానీ మరణించిన నేపథ్యంలో ఘటనపై ఐక్యరాజ్యసమితి ప్రకటన విడుదల చేసింది. గల్ఫ్​లో మరో యుద్ధాన్ని ఈ ప్రపంచం భరించలేదని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​ వ్యాఖ్యానించారు. నాయకులంతా సంయమనం పాటించాల్సిన సమయమని గుటెరస్​ అభిప్రాయపడ్డారు.

బాగ్దాద్​ విమానాశ్రయంలో అమెరికా జరిపిన డ్రోన్​ దాడితో ప్రపంచం ఉలిక్కిపడింది. ఈ ఘటనలో ఇరాన్​ రెండో అత్యంత శక్తిమంతమైన నేత ఖాసీం సులేమాని మరణించారు. ఇరాన్​ కుర్దు​ దళాలకు సులేమానీ నేతృత్వం వహిస్తున్నారు. సులేమానీ మృతితో ఇరాన్​లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్​ వేదికగా ట్రంప్ స్పందించారు.

"జనరల్​ ఖాసీం సులేమానీ ఎన్నో ఏళ్లుగా వేలాది మంది అమెరికన్లను పొట్టన పెట్టుకున్నారు. ఇంకా చాలా మందిని చంపేందుకు కుట్ర పన్నారు. లక్షలాది మంది ప్రజల మరణానికి సులేమానీ​ ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమయ్యారు. ఇటీవల ఇరాన్​లోనే పెద్ద సంఖ్యలో నిరసనకారులను చంపేశారు."

-డొనాల్డ్ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

సులేమానీని ఇరాన్​ పౌరులు ద్వేషిస్తున్నారని ఈ విషయాన్ని అక్కడి నేతలు అంగీకరించడం లేదన్నారు. అతడిని ఎన్నో ఏళ్ల క్రితమే చంపేయాల్సిందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:జమ్ముకశ్మీర్​లో పేలిన మందుపాతర... జవాన్లకు గాయాలు

Punjab (Pakistan), Jan 04 (ANI): A large number of Muslims had gathered and shouted anti-Sikh slogans outside the Nankana Sahib Gurdwara in Pakistan's Punjab on January 03. Earlier in the day, stones were also pelted at the Gurdwara led by the family of a boy who had allegedly abducted a Sikh girl Jagjit Kaur, daughter of the Gurdwara's panthi. The protesters also threatened to destroy the gurdwara and build a mosque in its place. The violent mob later dispersed after the police released Hassan, the man who had allegedly abducted Jagjit Kaur.

Last Updated : Jan 4, 2020, 7:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.