MIGA NEW VICE PRESIDENT: ప్రపంచ బ్యాంకు భారత ముఖ్య అధికారి జునైద్ కమల్ అహ్మద్.. ఆ సంస్థ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. ఆపరేషన్స్ మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారెంటీ ఏజెన్సీకి(MIGA) వైస్‌ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న అహ్మద్, చరిత్రలోనే ఇంత ఉన్నత స్థాయికి ఎదిగిన రెండో బంగ్లాదేశ్ జాతీయుడు కావడం విశేషం.
"భారత్‌తో ప్రపంచ బ్యాంక్‌కు ఉన్న భాగస్వామ్యం.. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు నేర్చుకునేందుకు వీలు కల్పిస్తోంది. 2016 నుంచి భారతదేశ ప్రతినిధిగా పని చేస్తున్న అనుభవం నా జీవితంలో చాలా ముఖ్యమైనది. ఆ అనుభవమే నన్ను ఈ స్థానంలో నిలబెట్టింది. దీర్ఘకాలిక సవాళ్లను ఎదుర్కొవాలంటే డబ్బు చాలా అవసరం " అని జునైద్ కమల్ అహ్మద్ చెప్పారు.
ఏప్రిల్ 16వ తేదీ నుంచి అహ్మద్ బాధ్యతలను స్వీకరిస్తారని బ్యాంకు అధికారులు తెలిపారు. ప్రపంచ బ్యాంకు గ్రూప్‌లో ఉన్న ఆర్థిక సంస్థలు, పెట్టుబడిదారులతో MIGA భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడానికి అహ్మద్ కృషి చేయాలని చెప్పారు. అహ్మద్‌కు లోతైన అనుభవం, ఆలోచనా శక్తితో కూడిన నాయకత్వం వంటి లక్షణాలు ఉండడం వల్ల ఈ పదవికి ఎంపిక చేశామని అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 11వేల 499 నమోదు