అమెరికా ఉపాధ్యక్షురాలు(America Vice President) కమలా హారిస్‌ను(Kamala Harris) హత్య చేయాలని ఓ మహిళ కుట్ర పన్నింది. అయితే అధికారులు ఆ కుట్రను భగ్నం చేశారు.
అసలేం జరిగింది?
దక్షిణ ఫ్లోరిడాకు చెందిన నివియేన్ పెటిట్ ఫెల్ప్స్ (39) అనే మహిళ.. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను(Kamala Harris) హత్య చేయాలని చూసినట్లు మియామీ ఫెడరల్ కోర్టులో ఒప్పుకుంది. ఆరు సార్లు కమలా హారిస్‌ను తాను హత్య చేస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు అంగీకరించింది.
ఫిబ్రవరిలో కమలను(Kamala Harris) హత్య చేస్తానని.. జైలులో ఉన్న తన భర్తకు తనంతట తాను తీసుకున్న వీడియో రికార్డు చేసిన క్లిప్పులను పంపించిందని న్యాయవాదులు తెలిపారు. కమలపై దాడి చేసేందుకు దుండగులతో 53,000 డాలర్లకు తాను బేరం కుదుర్చుకున్నానని, 50 రోజుల్లో ఆమెను హత్య చేస్తానని వీడియోల్లో ఫెల్ప్స్ చెప్పిందని పేర్కొన్నారు.
ఫెల్ప్స్ ఈ వీడియో క్లిప్పుల్లో కొన్నింటిని తనంతట తానే రికార్డు చేయగా.. మరికొన్నింటిని ఆమె పిల్లలు రికార్డు చేశారని అధికారులు తెలిపారు. ఈ వీడియోల తర్వాత.. ఆమె ఓ తుపాకీ గురిపెట్టి పట్టుకున్న ఫొటోను పంపిందని చెప్పారు. అనంతరం.. రెండు రోజులకు లైసెన్సు కోసం దరఖాస్తు చేసిందని పేర్కొన్నారు. అయితే.. దర్యాప్తు అధికారులు తన ఇంటికి రాకపోయి ఉంటే ఏం జరిగుండేదో తనకు కూడా తెలియదని ఫెల్ప్స్ వారితో చెప్పడం గమనార్హం.
ఇదీ చూడండి: మీటూ బాధితురాలిపైనా చైనా ఉక్కుపాదం!
ఇదీ చూడండి: ఒకప్పుడు ఖైదీలు.. ఇప్పుడదే జైలుకు బాస్‌లు