ETV Bharat / international

మంచు తుపానుకు టెక్సాస్​ గజగజ - millions without power supply in texas

అమెరికాలోని టెక్సాస్​లో మంచు తుపాను తీవ్రత కొనసాగుతోంది. గురువారం వరకు హిమపాతం తగ్గుముఖం పట్టే అవకాశం లేదని వాతావరణ శాఖ అంచనా వేసింది. విద్యుత్ పునరుద్ధరణకు మరింత సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.

texas, snow fall
టెక్సాస్​లో కొనసాగుతున్న మంచు తుపాను
author img

By

Published : Feb 16, 2021, 11:20 AM IST

మంచు తుపాను అమెరికాలోని టెక్సాస్​ రాష్ట్రాన్ని బెంబేలెత్తిస్తోంది. ఎడతెరపి లేని హిమపాతానికి జనజీవనం స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో పరిమితంగా విద్యుత్​ పంపిణీ జరుగుతోంది. బయటకు వెళ్లడమే గగనం కాగా... చాలా చోట్ల రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. మంచు తుపాను ప్రభావం గురువారం వరకు ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

texas, snow fall
మంచు దుప్పటిలో రహదారులు
texas, snow fall
నిర్మానుష్యంగా రోడ్లు..

ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధ్యక్షుడు జో బైడెన్​ ఇప్పటికే హోం శాఖకు ఆదేశాలు జారీ చేశారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. అయితే విద్యుత్​ పునరుద్ధరణపై ఇంకా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. శీతల వాతావరణం కారణంగా సంస్థలు ఏ రకంగానూ విద్యుత్​ను ఉత్పత్తి చేయలేకపోతున్నాయని అధికారులు చెబుతున్నారు.

texas, snow fall
మంచు తీవ్రతకు రోడ్డుపై ఆగిపోతున్న వాహనాలు
texas, snow fall
యంత్రాల సాయంతో మంచు తొలగింపు

"విద్యుత్​ పునరుద్ధరణ త్వరగా జరుగుతుందని ఎవరూ ఆశించకండి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరింత సమయం పట్టే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్​ నిలిచిపోయే పరిస్థితి రాకూడదంటే అందరూ వీలైనంత వరకు విద్యుత్​ వినియోగానికి దూరంగా ఉండండి."

-సిల్వస్టర్​ టర్నర్​, హూస్టన్​ మేయర్​

తుపాను ప్రభావం కొవిడ్​ టీకా పంపిణీపైనా పడింది. హారిస్​ కౌంటీ సహా పలు ప్రాంతాల్లో విద్యుత్​ సరఫరా నిలిచిపోవడం వల్ల కొవిడ్​ టీకాలు పాడయ్యే ప్రమాదం ఉంది. నష్టనివారణపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

ఇదీ చదవండి : అమెరికాను బెంబేలెత్తిస్తున్న హిమపాతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.