ETV Bharat / international

'కరోనా కుట్ర'పై బిల్​గేట్స్​ కీలక వ్యాఖ్యలు - Covid news of Bill gates

కరోనా వైరస్‌ ఆవిర్భవానికి కారణం తానే అన్న కుట్ర సిద్ధాంతాలను అపర కుబేరుడు బిల్‌గేట్స్‌ తిప్పికొట్టారు. మహమ్మారికి, తనకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. నిజానికి తాను మహమ్మారి అంతం కోసం భారీ ఎత్తున ఖర్చుచేస్తున్నానని పునరుద్ఘాటించారు. ఇలాంటి ప్రచారాలను ఆపాలని సూచించారు.

Will I kill the people with the Vaccine: Bill gates
టీకాపై కుట్ర సిద్ధాంతాలను కొట్టిపారేసిన బిల్​గేట్స్​
author img

By

Published : Jul 24, 2020, 5:43 PM IST

కొవిడ్‌-19ను అరికట్టేందుకు త్వరలోనే టీకా రావాలని బిల్‌గేట్స్‌ చాలాసార్లు అన్నారు. ఈ మేరకు అన్ని దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పనిచేయాలని సూచించారు. అంతేకాకుండా.. ఎలాంటి మహమ్మారినైనా ఎదుర్కోవడానికి ఒక వ్యాక్సిన్‌ సిద్ధంగా ఉండాలని కూడా పేర్కొన్నారు బిల్​గేట్స్​.

అయితే వీటి ఆధారంగా బిల్‌గేట్స్‌పై కుట్ర సిద్ధాంతాలు ఇంటర్‌నెట్‌లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. కరోనా వైరస్‌ ఆవిర్భావానికి ఆయనే కారణమన్న ఓ వీడియోను యూట్యూబ్‌లో కోట్ల సంఖ్యలో వీక్షించారు. కరోనా వ్యాక్సిన్‌ ద్వారా భూమిపై కనీసం 15 శాతం జనాభాను హతం చేయాలన్నది ఆయన లక్ష్యమని అందులో పేర్కొనడం గమనార్హం.

తనపై సాగుతున్న కుట్ర సిద్ధాంతాలపై బిల్‌గేట్స్‌ స్పందించారు.

'మహమ్మారి, సామాజిక మాధ్యమాలది ఓ దుష్ట కలయిక. ప్రజలు తేలికైన వివరణ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలని ఇతర స్వచ్ఛంద సంస్థల కన్నా ఎక్కువ డబ్బు ఖర్చుచేస్తున్నాం.'

- బిల్​గేట్స్​, మైక్రోసాఫ్ట్‌ స్థాపకుడు

కరోనా మహమ్మారిపై పోరాడేందుకు 250 మిలియన్‌ డాలర్లు ఖర్చుచేస్తానని ఇదివరకే ప్రకటించారు బిల్​గేట్స్​. గత 20 ఏళ్లలో అనేక దేశాల్లో వైద్య సదుపాయాల అభివృద్ధికి ఆయన వందల కోట్ల డాలర్లు విరాళంగా ఇచ్చారు.

'ప్రజలను టీకాలతో చంపేందుకు ప్రయత్నించి మేం డబ్బు సంపాదించామేమో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మీరన్నది నిజమే. మాకు వ్యాక్సిన్లతో అనుబంధం ఉంది. కానీ అది మీరు అనుకుంటున్నట్లు కాదు. నిజానిజాలేమిటో అర్థం చేసుకుంటారన్న విశ్వాసం నాకుంది.'

- బిల్​గేట్స్​, మైక్రోసాఫ్ట్‌ స్థాపకుడు

2015లో జికా వైరస్‌ వెలుగు చూసినప్పుడు కూడా బిల్​గేట్స్​పై ఇలాంటి కుట్ర సిద్ధాంతాలు వెల్లువెత్తాయి.

ఇదీ చదవండి: 'కరోనాను దీటుగా ఎదుర్కోగల సత్తా భారత్​ సొంతం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.