ETV Bharat / international

టీకా తీసుకున్నా మళ్లీ కరోనా.. ఎందుకిలా? - పౌరులందరికీ టీకాల పంపిణీ సాధ్యమేనా?

వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా సోకుతుండటం కలవరపెడుతోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? ఇలాంటి సందర్భాల్లో ఆరోగ్య పరిస్థితి విషమిస్తుందా? అంటే.. అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. అసలు టీకా తీసుకున్నప్పటికీ రక్షణ కలగకపోవడానికి కారణమేంటి? టీకాలతో రోగనిరోధక శక్తి పెరుగుతుందా? లేదా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు చూద్దాం..

corona
కరోనా
author img

By

Published : Jul 29, 2021, 2:39 PM IST

మనలో చాలామంది టీకా తీసుకుంటే కరోనా సోకదని భావిస్తూ ఉండొచ్చు. అయితే.. డెల్టా, కప్పా సహా ఇతర వేరియంట్ల కారణంగా వేగంగా పెరుగుతున్న కొత్త కేసుల వ్యాప్తి కలవరపెడుతోంది. అంతేగాక.. టీకా తీసుకున్నవారికీ కరోనా సోకడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ అంశంపై విస్తృత పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. వైరస్ ముప్పు మళ్లీ తప్పదని హెచ్చరిస్తున్నారు. టీకాలు చాలావరకు కరోనా వ్యాప్తిని అడ్డుకుంటాయని.. అయితే అది తాత్కాలికమేనని అంటున్నారు. దీనినే 'బ్రేక్ త్రూ ఇన్​ఫెక్షన్​'గా అభివర్ణిస్తున్నారు. టీకా తీసుకున్నప్పటికీ కరోనా సోకుతుందా? సోకితే ఏ మేరకు ప్రమాదకరం? అనే అంశాలను ఓసారి పరిశీలిద్దాం..

బ్రేక్ త్రూ ఇన్​ఫెక్షన్ అంటే?

వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తయిన 14 రోజుల తర్వాత కరోనా సోకితే దీనిని బ్రేక్​ త్రూ ఇన్​ఫెక్షన్​గా అమెరికా అంటు వ్యాధుల నియంత్రణ సంస్థ నిర్ధరించింది. ఈ నేపథ్యంలో వివిధ వ్యాధుల నివారణకు అందించే టీకాల్లో ఏది కూడా 100 శాతం ప్రభావవంతంగా లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • పోలియో వ్యాక్సిన్ 80-90 శాతం, మీజిల్స్ టీకా(తట్టు వ్యాధి) 94 శాతం సామర్థ్యంతో పనిచేస్తాయని ఉదహరిస్తున్నారు. అందువల్లే వాటి ముప్పు పూర్తిగా తొలగిపోలేదని.. దీని ప్రకారం రెండు డోసుల టీకా తీసుకున్నప్పటికీ కరోనా ముప్పు ఉంటుందని పేర్కొన్నారు.
  • 'ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్​లో తేలింది. కరోనాపై పోరుకు ఇది శుభపరిణామమే అయినప్పటికీ.. మిగతా 5 శాతం మంది వైరస్ బారిన పడేందుకు అవకాశం ఉన్న విషయాన్ని మర్చిపోకూడదు' అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

టీకా తీసుకుంటే వైరస్ వ్యాప్తి సాధారణమేనా?

ఇప్పటికీ సాధారణ, తేలికపాటి లక్షణాలతో వ్యాక్సిన్లు తీసుకున్న వారికి కరోనా సోకుతోంది. టీకాతో గరిష్ఠ రక్షణ ఉన్నప్పటికీ.. ప్రస్తుతం డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నందున జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • అమెరికాలో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం.. 2020 డిసెంబర్​లో 2,58,716 మంది ఫైజర్, మోడెర్నాలలో ఏదో ఒక టీకా తీసుకోగా వారిలో 410 అంటే 0.16 శాతం మందికి మాత్రమే వైరస్ సోకింది.
  • అదేవిధంగా న్యూయార్క్‌లో టీకా రెండు డోసులు తీసుకున్న 1,26,367 వారిలో 2021 ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య 86 బ్రేక్ త్రూ ఇన్​ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. ఇది మొత్తం కేసుల్లో 1.2 శాతం.

బ్రేక్​ త్రూ ఇన్​ఫెక్షన్ తీవ్రత ఎంత?

టీకా తీసుకున్న వారిలో 27 శాతం మందికి లక్షణాలు లేకుండానే వైరస్ సోకుతుంది. 10 శాతం మంది మాత్రమే ఆసుపత్రిలో చేరుతుండగా.. రెండు శాతం మంది మరణిస్తున్నారు. అదే సమయంలో టీకాలు అందుబాటులోకి రాకముందు ఈ తరహా కేసుల్లో నమోదైన మరణాలు ఆరు శాతం.

ఇదీ చదవండి: ప్రపంచ దేశాల్లో కేసులు తీవ్రం- మూడోవేవ్ మొదలైనట్టేనా?

ఇదీ చదవండి: 'కొవిడ్​ కట్టడిలో సంతృప్తికి స్థానం లేదు'

ఈ తరహా ఇన్​ఫెక్షన్లకు కారణం ఏంటి?

దేశవ్యాప్తంగా కరోనా కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి.

  • రెస్టారెంట్​ల వద్ద రద్దీ, పండుగలు, పార్టీలు వంటివి కరోనా వ్యాప్తికి అవకాశం కల్పిస్తున్నాయి.
  • కొవిడ్ రోగులకు సేవ చేసే ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బందిలో 'బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్లు' ప్రబలే అవకాశం ఎక్కువ.
  • ఇక బీపీ, డయాబెటిస్, గుండె జబ్బులు, మూత్రపిండ, ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు సైతం ఈ తరహా ఇన్​ఫెక్షన్​కు గురయ్యే అవకాశం అధికం.
  • ఒక అధ్యయనం ప్రకారం.. అవయవ మార్పిడి చేయించుకున్న ఓ వ్యక్తి టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ.. బ్రేక్​ త్రూ ఇన్​ఫెక్షన్​కు గురయ్యే అవకాశాలు 82 రెట్లు అధికం, 485 రెట్లు మరణించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

డెల్టాతో పరిస్థితులు మరింత క్షీణించాయా?

వాస్తవానికి సార్స్-కోవ్-2 వైరస్ జాతుల నివారణకు టీకాలను అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. అయితే కొత్తగా వెలువడుతున్న వేరియంట్లను సైతం అందుబాటులో ఉన్న టీకాలు ప్రభావవంతంగా అడ్డుకుంటున్నాయి. ముఖ్యంగా ఆసుపత్రి పాలుకాకుండా పరిస్థితిని అదుపులో ఉంచుతున్నాయి. అయితే పూర్తి సమర్థంగా పనిచేస్తాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

  • ఇంగ్లాండ్ ప్రజారోగ్య సంస్థ ప్రకారం.. రెండు డోసుల టీకాలు డెల్టాపై 79 శాతం మాత్రమే ప్రభావవంతంగా ఉన్నాయి.
  • ఒక డోసు తీసుకున్నట్లయితే ఈ రక్షణ 35 శాతం మాత్రమే.
  • ఇక రెండు డోసుల ఫైజర్ టీకా.. డెల్టా వేరియంట్​పై 39 శాతం మాత్రమే సమర్థవంతమని ఇజ్రాయెల్​ పరిశోధనలు తేల్చాయి. అయితే.. ఒక వ్యక్తి ఆసుపత్రిపాలు కాకుండా టీకా కాపాడుతుందని తేల్చింది.

మొత్తంగా టీకాలు ఎంతమేరకు మేలు చేస్తాయి?

'దేశంలో రెండే వర్గాలు.. ఒకటి టీకాలు వేసుకున్న వారు, రెండు తీసుకోని వారు' అని అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంథోనీ ఫౌచీ టీకా ప్రాముఖ్యతను చెప్పకనే చెప్పారు.

సకాలంలో టీకాలు అందించి ఉంటే అగ్రరాజ్యంలో సుమారు 2,79,000, ఇంగ్లాండ్‌లో 30,300 ప్రాణాలను కాపాడి ఉండొచ్చనేది ఒక అంచనా. అందువల్ల వేగవంతమైన టీకా పంపిణీతో 'బ్రేక్ త్రూ ఇన్​ఫెక్షన్​'లను సమర్థంగా అడ్డుకోవచ్చని చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.