ETV Bharat / international

కొత్త రకం కరోనాపై టీకాలు పనిచేస్తాయా?

కొత్త రకం కరోనా వైరస్​పై ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు పనిచేస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ధ్రువీకరించేందుకు పరిశోధనలు జరుపుతున్నారు.

author img

By

Published : Dec 30, 2020, 5:16 AM IST

Will COVID-19 vaccines work on the new coronavirus variant?
కరోనా కొత్త రకంపై టీకాలు పనిచేస్తాయా?

కరోనా టీకాలు అందుబాటులోకి రావడం వల్ల ఊపిరిపీల్చుకున్న ప్రజలపై 'కొత్త రకం' వైరస్​ వార్తలు పిడుగులా పడ్డాయి. బ్రిటన్​లో వెలుగుచూసిన ఈ స్ట్రెయిన్​పై సర్వత్రా ఆందోళనలు నెలకొన్నాయి. చేతిలో వ్యాక్సిన్​ ఉన్నా.. ఈ స్ట్రెయిన్​పై అది పనిచేస్తుందా? లేదా? అన్న అనుమానాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే కొత్త కరోనా స్ట్రెయిన్​పై వ్యాక్సిన్లు పనిచేస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ధ్రువీకరించేందుకు పరిశోధనలు జరుపుతున్నారు.

ఈ వ్యవహారంపై అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఫౌచీ స్పందించారు. బ్రిటన్​ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. కొత్త స్ట్రెయిన్​పై టీకా పనిచేస్తుందని పేర్కొన్నారు. అయితే దీనిని ధ్రువీకరించుకునేందుకు.. అమెరికా కూడా పరీక్షలు నిర్వహిస్తుందని స్పష్టం చేశారు.

వైరస్​లో జన్యు మార్పులు సంభవించడం సహజమేనని.. అయితే అవి శక్తివంతంగా మారితే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు పనిచేయవని నిపుణులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు అలా కనిపించడం లేదని.. వైరస్​పై వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పనిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:- వుహాన్​లో హడావుడిగా వ్యాక్సినేషన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.