ETV Bharat / international

Russia-Ukraine Crisis: 'రష్యా- ఉక్రెయిన్​ మధ్య యుద్ధం వస్తే విపత్తే'!

Russia-Ukraine Crisis: రష్యా-మధ్య యుద్ధం జరిగితే విపత్తు ఏర్పడుతుందని హెచ్చరించారు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడానికి దౌత్యానికి మించిన ప్రత్యామ్నాయం లేదని సూచించారు.

Russia-Ukraine Crisis
russia ukraine
author img

By

Published : Feb 19, 2022, 6:49 AM IST

Updated : Feb 19, 2022, 7:14 AM IST

Russia-Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు యుద్ధానికి దారితీస్తే సంభవించేది విపత్తేనని హెచ్చరించారు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్​ ఆంటోనియో గుటెరస్​. దౌత్యానికి మించిన ప్రత్యామ్నాయం లేదని సూచించారు.

"ఉక్రెయిన్ చుట్టూ రష్యా బలగాల మోహరింపుతో ఐరోపాలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య యుద్ధం జరగదనే అనుకుంటన్నా. అదే జరిగితే విపత్తుగా పరిణమిస్తుంది. తక్షణమే బలగాల ఉపసంహరణ చేపట్టాల్సిన అవసరం ఉంది." అని గుటెరస్ పేర్కొన్నారు.

ప్రజల్ని రష్యాకు తరలిస్తున్న తిరుగుబాటుదారులు..

మరోవైపు రష్యా-ఉక్రెయిన్‌ మధ్య పరిస్థితి రోజురోజుకీ విషమిస్తోంది. ముఖ్యంగా తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతంలో ఉక్రెయిన్‌ బలగాలకు, రష్యా అనుకూల వేర్పాటు వాదులకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు మొదలయ్యాయి. పరస్పరం ఫిరంగుల మోతతో ఈ ప్రాంతం దద్దరిల్లుతోంది. ఈ వివాదాస్పద ప్రాంతంలో గత రెండు రోజుల్లో దాదాపు 500 పేలుళ్లు నమోదయ్యాయి. ఈ ఘర్షణలు అమెరికా సహా నాటో కూటమిని కలవరపరుస్తున్నాయి. ఉక్రెయిన్‌ సైన్యమే కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని 2014 నుంచి ఈ ప్రాంతాన్ని అదుపులోకి ఉంచుకొని పాలిస్తున్న రష్యా అనుకూల వేర్పాటువాదులు అంటున్నారు. వీటిని ఉక్రెయిన్‌ ఖండించింది. చిన్నారుల పాఠశాలపై తిరుగుబాటుదారులు జరిపిన దాడి చిత్రాలను విడుదల చేసింది. ఇందులో విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదు. పాఠశాల గోడ ధ్వంసమైంది. దీనిపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ట్వీట్‌ చేశారు. డాన్‌బాస్‌లోని డొనియెస్కీ, లుహాన్స్క్‌లోని వేర్పాటు వాద ప్రభుత్వాలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో శుక్రవారం డొనియెస్కీ ప్రాంత వేర్పాటువాద ప్రభుత్వ నేత పుష్లిన్‌ కీలక ప్రకటన చేశారు. తమ ప్రాంతంలోని మహిళలను, వృద్ధులను, చిన్నారులను రష్యాకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. వీరికి ఆశ్రయం కల్పించేందుకు రష్యా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

విన్యాసాలను వీక్షించనున్న పుతిన్‌

ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్న వేళ.. రష్యా కీలక ప్రకటన చేసింది. అణు బాంబులను మోసుకెళ్లే ఖండాతర, క్రూయిజ్‌ క్షిపణులతో శనివారం సైనిక విన్యాసాలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఇందులో ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో క్రిమియా కేంద్రంగా ఉన్న రష్యా నల్లసముద్రపు నావికాదళ యుద్ధనౌకలు కూడా పాల్గొననున్నాయి. ఈ విన్యాసాలను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ రక్షణ మంత్రిత్వశాఖ కార్యాలయం నుంచి వీక్షించనున్నారు.

దండయాత్ర పక్కా.. సాకు కోసమే చూస్తోంది

డాన్‌బాస్‌ ప్రాంతానికి సంబంధించి గతంలో జరిగిన మిన్స్క్‌ ఒప్పందాన్ని ఉక్రెయిన్‌ ఉల్లంఘించిందని, దీనిపై చర్చ జరపాలని రష్యా కోరడంతో గురువారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం జరిగింది. ఇందులో రష్యా వైఖరిపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉక్రెయిన్‌పై మాస్కో దాడి చేయడం పక్కా అని, సాకు కోసమే ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ ఎదురుచూస్తున్నారని అన్నారు. ముఖ్యంగా రష్యా అనుకూల వేర్పాటువాద ప్రభుత్వాలు ఉన్న డాన్‌బాస్‌ ప్రాంతంలో బాంబు, డ్రోన్‌ దాడులు తానే చేసి, నెపం ఉక్రెయిన్‌పైకి నెట్టి.. యుద్ధ శంఖారావం మోగించడానికి మాస్కో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అదీ కుదరకపోతే బాంబులతో తమ దేశంలోనే రష్యా దాడులు నిర్వహిస్తుందని, లేకపోతే సామూహిక ఖనన ప్రదేశాలు దొరికాయన్న నెపంతో దండెత్తుతుందని చెప్పారు.

పుతిన్‌కే చైనా మద్దతు

ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇవ్వకూడదన్న మాస్కో డిమాండ్‌కు చైనా మద్దతు పలికింది. అదే సమయంలో సమస్యను దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలన్న ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ అంటోనియో గుటెరస్‌ వ్యాఖ్యలు అనుసరణీయమని తెలిపింది. అమెరికాయే ఉద్రిక్తతలను రెచ్చగొడుతోందని చైనా విదేశాంగ శాఖ ఆరోపించింది. దౌత్యపరంగా నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత్‌ సూచించింది. మిన్స్క్‌ ఒప్పందం, నార్మండీ చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని భద్రత మండలిలో భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి తెలిపారు. భారత్‌ చాలా సమతూకంగా, స్వతంత్రంగా వ్యవహరించిందని రష్యా కొనియాడింది.

లక్ష కాదు.. లక్షా 50 వేలు!

ఉక్రెయిన్‌ సరిహద్దుల నుంచి బలగాల ఉపసంహరణ జరుగుతోందన్న రష్యా ప్రకటనలను అమెరికా కొట్టిపారేసింది. లక్ష సైన్యాన్ని, లక్షా 50 వేలకు మాస్కో పెంచిందని పేర్కొంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు బైడెనే స్వయంగా తెలిపారు. ఐరోపా భద్రతా సహకార సంస్థలోని అమెరికా ప్రతినిధి మైకెల్‌ కార్పెంటర్‌ కూడా ఈ సంఖ్య ఇంకా భారీగా ఉందని చెప్పారు. 1,69,000 నుంచి 1,90,000 మధ్యలో రష్యా సైన్యాన్ని మోహరించిందని పేర్కొన్నారు.

భారతీయుల కోసం మూడు విమానాలు

యుద్ధ మేఘాలు నెలకొన్న దృష్ట్యా ఉక్రెయిన్‌లోని భారత పౌరుల, విద్యార్థుల కోసం వచ్చేవారం ఎయిరిండియా మూడు ప్రత్యేక విమానాలను నడపనుంది. ఈ మేరకు ఆ సంస్థ ఒక ప్రకటన విడదల చేసింది. ఫిబ్రవరి 22, 24, 26 తేదీల్లో ఈ విమానాలు భారత్‌ నుంచి ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు సమీపంలోని బోరిస్పిల్‌ విమానాశ్రయానికి వెళ్లనున్నాయి.

ఇదీ చూడండి: యుద్ధం వస్తే భారత్​కు తిప్పలే!- వాటిపై తీవ్ర ప్రభావం..

Last Updated : Feb 19, 2022, 7:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.