అల్జీరియాలోని పలు ప్రాంతాల్లో చెలరేగిన కార్చుచ్చుకు 42 మంది బలయ్యారు. ఇందులో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన 25 మంది సైనికులు కూడా ఉన్నారు. చనిపోయిన సైనికులు 100 మంది ప్రజల ప్రాణాలను కాపాడారని అల్జీరియా అధ్యక్షుడు అబ్దెల్ మజీద్ టెబ్బౌనె ట్వీట్ చేశారు. మరో 11 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.
గ్రీస్
గ్రీస్‌లో ఇదివరకెన్నడూ చూడని కార్చిచ్చు చెలరేగింది. వేల హెక్టార్ల అటవీ భూమి దగ్ధమైంది. 60 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోకి తరలించారు. ఓ అగ్నిమాపక దళ సిబ్బంది మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎనిమిది రోజుల్లో 586 కార్చిచ్చు ఘటనలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యంత ప్రతికూల వాతావరణం ఉన్నప్పుడు కూడా ఏడాదికి 40 ఘటనలు మాత్రమే జరిగేవని పేర్కొన్నారు.
అమెరికా
కాలిఫోర్నియాలో గతకొద్దివారాలుగా మండుతున్న కార్చిచ్చుకు 900 భవనాలు తగలబడిపోయాయి. సమీపంలో ఉన్న అడవులను మంటలు దహించివేస్తున్నాయి. 6 వేల మంది అగ్నిమాపక దళ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. హెలికాప్టర్ల సాయంతో రసాయనాలను చల్లుతున్నారు.
ఇటలీలోనూ కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది.
టర్కీలో అనేక హెక్టార్ల భూమి మంటలకు ఆహుతైంది.
ఇదీ చదవండి: కాలిఫోర్నియాలో భయానక దృశ్యాలు