ETV Bharat / international

ట్రంప్​కు '7 కీస్​' గండం- ఎన్నికల్లో ఓటమి తథ్యం!

author img

By

Published : Aug 10, 2020, 2:52 PM IST

రానున్న ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఓటమి తథ్యమని అమెరికాలోని ప్రముఖ చరిత్రకారుడు లిచ్​మన్​ జోస్యం చెప్పారు. లిచ్​మన్​ తన 'కీస్​' మోడల్​తో వేసిన అంచనాలు న్యూయార్క్​ టైమ్స్​లో ప్రచురితమయ్యాయి. ఇప్పుడు ఇది రిపబ్లికన్లను కలవరపెడుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో లిచ్​మన్​ అంచనాలు అనేకమార్లు నిజం కావడమే ఇందుకు కారణం.

Why Trump will lose the 2020 US presidential election
అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​ ఓటమి తథ్యం.. ఇదే కారణం!

వాణిజ్య యుద్ధం, కరోనా వైరస్​, సమాజంలో అనిశ్చితి, నిరుద్యోగం... ఇవీ గత కొంతకాలంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఎదుర్కొంటున్న సవాళ్లు. ముఖ్యంగా కరోనా వైరస్​పై తన వైఖరితో సర్వత్రా విమర్శల పాలయ్యారు ట్రంప్​. ఇన్ని ప్రతికూలతల మధ్య మరికొన్ని నెలల్లో అధ్యక్ష ఎన్నికలకు వెళ్లనున్నారాయన​. ఈసారి ఎన్నికల్లో ట్రంప్​ ఓటమి ఖాయమని ఇప్పటికే అనేక పోల్స్​ స్పష్టం చేస్తున్నాయి. వాటన్నింటినీ అధ్యక్షుడు కొట్టిపారేస్తున్నారు. కానీ న్యూయార్క్​ టైమ్స్​లో తాజాగా ప్రచురితమైన ఓ కథనం ఇప్పుడు రిపబ్లికన్లను కలవరపెడుతోంది. ఈ ఎన్నికల్లో ట్రంప్​ ఓటమి తథ్యమని 'ఆలన్​ లిచ్​మన్'​ అంచనా వేయడం.. వారి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో లిచ్​మన్​ అంచనాలు అనేకమార్లు నిజం కావడమే ఇందుకు కారణం. ఇంతకీ ఎవరు ఈ లిచ్​మన్​?

ఇదీ చూడండి:- అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్నట్టా? లేనట్టా?

గురి తప్పదు...

వాషింగ్టన్​లోని అమెరికన్​ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్నారు లిచ్​మన్​. ఆయన రూపొందించిన 'కీస్​' మోడల్​ ఎంతో ప్రసిద్ధి చెందింది. 1980 నుంచి జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అనేకమార్లు లిచ్​మన్​ అంచనాలు నిజమయ్యాయి. వివిధ రకాల పోల్స్​కు అతీతంగా లిచ్​మన్​ అంచనాలు నిజమవ్వడం విశేషం.

అలాంటి లిచ్​మన్​.. ఇప్పుడు ట్రంప్​కు ప్రతికూలంగా మాట్లాడటం వల్ల అధ్యక్షుడి భవితవ్యం సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఏంటీ కీస్​ మోడల్​?

లిచ్​మన్​ కీస్​ మోడల్.. '13 చారిత్రక కారణాల'పై ఆధారపడి ఉంటుంది. అవి.. మధ్యంతర లాభాలు, పోటీ లేకపోవడం, ప్రస్తుత పదవీ బాధ్యతలు, మూడో వ్యక్తి జోక్యం లేకపోవడం, బలమైన 'స్వల్పకాలిక' ఆర్థిక వ్యవస్థ, బలమైన 'దీర్ఘకాలిక' ఆర్థికవ్యవస్థ, ప్రధాన విధానాల మార్పు, స్కామ్​లు లేకపోవడం, సైనిక/విదేశాంగ విధానాల్లో విఫలంకాకపోవడం, విదేశీ-సైనిక విధానాల్లో విజయం, అనిశ్చితి లేని సమాజం, సుపరిపాలన, ప్రజాకర్షణ శక్తి.

ఇదీ చూడండి:- ట్రంప్- బైడెన్ ఢీ అంటే ఢీ.. తొలి చర్చ అప్పుడే

ఈ 13 కీస్​.. 'అవును', 'కాదు' అనే వాటిపైనే ఆధారపడి ఉంటాయి. ఆరు లేదా అంతకన్నా ఎక్కువ 'కాదు'లు ఉంటే అధ్యక్షుడు శ్వేతసౌధాన్ని వీడాల్సిందే.

లిచ్​మన్​ ప్రకారం.. ట్రంప్​ వర్సెస్​ బైడెన్​ విషయంలో.. అధ్యక్షుడికి తప్పుల కేటగిరీలో 7 కీస్​ పడ్డాయి. అవి.. మధ్యంతర లాభాలు, బలమైన 'స్వల్పకాలిక' ఆర్థిక వ్యవస్థ, బలమైన 'దీర్ఘకాలిక' ఆర్థికవ్యవస్థ, సమాజంలో అనిశ్చితి, స్కామ్​లు లేకపోవడం, విదేశీ-సైనిక విజయాలు, సుపరిపాలన.

ఇంతటి కచ్చితత్వం ఎలా సాధ్యం?

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై లిచ్​మన్​ అంచనాలు నిజమవ్వడానికి గల కారణాలను యూఎస్​ ఇండియా పొలిటికల్​ యాక్షన్​ కమిటీ వ్యవస్థాపక సభ్యుడు రాబిందర్​ సచ్​దేవ్​.. 'ఈటీవీ భారత్​'కు వివరించారు.

"లిచ్​మన్​ మోడల్​లో రెండు ప్రధాన విషయాలున్నాయి. లిచ్​మన్​ స్వయంగా ఓ హిస్టరీ ప్రొఫెసర్​. అమెరికా చరిత్ర, అధ్యక్ష పదవికి సంబంధించి చరిత్ర ఆయనకు బాగా తెలుసు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రెండ్స్​ ఎలా ఉంటాయో తెలుసు. ఓ ప్రొఫెసర్​గా ఆయన వాటిని, అమెరికా రాజకీయాలను బాగా అర్థం చేసుకోగలరు. రెండోది.. గతం, వర్తమానం, భవిష్యత్తుకు సంబంధించి.. ఎలాంటి పరిస్థితులు అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం చూపుతాయనే విషయాన్ని ఆయన గుర్తించారు. ఓ వ్యక్తి అధ్యక్ష పదవి చేపట్టినప్పుడు.. అప్పుడున్న ట్రెండ్స్​, అసలు ఆ వ్యక్తి ఎలా అధ్యక్షుడయ్యారనే అంశాన్ని లిచ్​మన్​ బాగా పరిశీలించగలరు. అదే ఆయన విశ్లేషణకు ముఖ్యమైనవని నేను అనుకుంటున్నా."

-- రాబిందర్​ సచ్​దేవ్

13 కీస్​ మోడల్​లో.. 'స్వల్పకాలిక ఆర్థిక వ్యవస్థ' ఒక్కటే స్వల్ప వ్యవధికి చెందినదని.. మిగిలిన కారణాలన్నీ దీర్ఘకాలికమేనని తెలిపారు సచ్​దేవ్​.

కీస్​ మోడల్​ ఎలా వచ్చింది?

లిచ్​మన్​ రూపొందించి ఈ కీస్​ మోడల్​ వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉందని సచ్​దేవ్​ వెల్లడించారు. దశాబ్దాల క్రితం.. రష్యాకు చెందిన సెస్మోలాజిస్ట్​ కెల్లిస్​-బొరొక్​ను కలిసి అనంతరం లిచ్​మన్​ ఈ మోడల్​ను అభివృద్ధి చేసినట్టు పేర్కొన్నారు.

"భూకంపాలు, రాజకీయాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ ఆలోచనే ఎంతో తెలివైనది. ఎక్కడైనా భూకంపం వస్తే.. దాని వెనుక అనేక కారణాలుంటాయి. అదే విధంగా శ్వేతసౌధంలో ఓ ప్రభుత్వం కూలడానికీ అనేక కారణాలుంటాయి."

---రాబిందర్​ సచ్​దేవ్​

లిచ్​మన్​ జీవితంలో మరో ఆసక్తికర విషయం ఉంది. స్వతహాగా లిచ్​మన్​ ఓ డెమొక్రాట్​. కానీ 2016 ఎన్నికల్లో డొనాల్డ్​ ట్రంప్​ విజయం సాధిస్తారని ఆయన అంచనా వేశారు. అప్పుడో ఎన్నో పోల్స్​ ఆయన అంచనాలకు విరుద్ధంగా ప్రకటనలు చేశాయి. చివరకు ట్రంప్​ శ్వేతసౌధ్యం బాధ్యతలు చేపట్టారు.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.