ETV Bharat / international

'వచ్చే ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్​'

వచ్చే ఏడాది చివరి నాటికి 2 బిలయన్లకుపైగా కరోనా వైరస్​ వ్యాక్సిన్​లు అందుబాటులోకి వచ్చే అవకాశముందని డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​ సైంటిస్ట్​ సౌమ్యా స్వామినాథన్​ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే వ్యాక్సిన్​ను ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయడం కూడా అతిపెద్ద సమస్యేనని అభిప్రాయపడ్డారు. దీనికి డబ్ల్యూహెచ్​ఓ ప్రణాళిక రూపొందిస్తుందన్నారు స్వామినాథన్​.

WHO scientist hopes for vaccine end of next year
వచ్చే ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్​!
author img

By

Published : Jun 18, 2020, 10:24 PM IST

కరోనాపై పోరులో వ్యాక్సిన్​ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ప్రపంచ దేశాలకు ఇప్పట్లో ఆ తీపికబురు అందేలా కనిపించడం లేదు. వచ్చే ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్​ను కనుగొనే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే అప్పటికి 2 బిలియన్లకుపైగా డోసులు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​ సైంటిస్ట్​ సౌమ్య స్వామినాథన్.

వ్యాక్సిన్​ కోసం ప్రస్తుతం అనేక మంది పరిశోధనలు చేస్తున్నారని... వచ్చే ఏడాది చివరి నాటికి వాటిల్లో కొన్ని అయినా సత్ఫలితాల్ని ఇస్తాయని సౌమ్య స్వామినాథన్​ అభిప్రాయపడ్డారు.

పంపిణీపై...

వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చినప్పటికీ... ప్రపంచ దేశాలకు దానిని పంపిణీ చేయడం మరో అతిపెద్ద సమస్య. ఈ వ్యవహారంపై స్పందించిన స్వామినాథన్​.. అధిక ప్రమాదం పొంచి ఉన్నవారికి మొదట వ్యాక్సిన్​ను అందించే విధంగా డబ్ల్యూహెచ్​ఓ ప్రతిపాదిస్తుందని స్పష్టం చేశారు. దీని ప్రకారం.. వృద్ధులు, డయాబెటిస్​- శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నవారు, ఉద్యోగులకు ఈ వ్యాక్సిన్​ తొలుత అందుతుంది.

అయితే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్​ పంపిణీపై ఇంకా ఎలాంటి ప్రణాళికలు లేవని పేర్కొన్నారు డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​ సైంటిస్ట్​. డబ్ల్యూహెచ్​ ప్రణాళిక రూపొందిస్తుందని వెల్లడించారు. కానీ దీనికి ప్రపంచ దేశాలు కట్టుబడి ఉండాలని అభిప్రాయపడ్డారు.

బ్రిటన్, ఫ్రాన్స్​, నెదర్లాండ్స్​, జర్మనీ, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు.. వ్యాక్సిన్​లు తొలుత తమ పౌరులకే అందే విధంగా ఇప్పటికే ఫార్మా సంస్థలతో ఒప్పందం చేసుకున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.