కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిపై ఆక్స్‌ఫర్డ్‌తో పాటు చైనా పరిశోధకులు అందించిన శుభవార్తపై ప్రశంసల వర్షం కురిపించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)లోని అత్యవసర విభాగం చీఫ్ మిచెల్ ర్యాన్. అయితే ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని హెచ్చరించారు.
"వాస్తవ ప్రపంచంలో భారీ స్థాయిలో ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంది. కానీ పరిశోధనలు.. వ్యాక్సిన్ కొనుగొనే ప్రక్రియలో అత్యంత కీలక దశను దాటుతుండటం సంతోషాన్నిచ్చే విషయం."
-- మిచెల్ ర్యాన్, డబ్ల్యూహెచ్ఓ అత్యవసర విభాగం చీఫ్.
ఇదీ చూడండి:- దోమల వల్ల కరోనా వ్యాప్తి చెందదు!
తమ వ్యాక్సిన్ ప్రయోగించిన వారిలో రోగనిరోధక ప్రతిస్పందనను టీకా ప్రేరేపించినట్లు ఆక్స్ఫర్డ్ వెల్లడించింది. 18-55 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిలో ద్వంద్వ రోగనిరోధక ప్రతిస్పందనలను వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగలిగినట్లు అధ్యయనం పేర్కొంది. దీనికి సంబంధించిన ఫలితాలు లాన్సెట్ పత్రికలో ప్రచురితమయ్యాయి.
చైనా పరిశోధకులు కూడా ఇదే తరహా విషయాన్ని బయటపెట్టారు. వీరి వ్యాక్సిన్ పరిశోధనలు ఆక్స్ఫర్డ్ అధ్యయనంతో పోలీ ఉన్నాయి.
ఇదీ చూడండి:- 'కరోనా విముక్త ప్రపంచం సమీప భవిష్యత్తులో సాధ్యం కాదు'