ETV Bharat / international

ఆ దేశాల్లో 81 శాతం పెరగనున్న క్యాన్సర్​ కేసులు!

అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో 2040 నాటికి 81 శాతం మేర క్యాన్సర్​ కేసులు పెరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) హెచ్చరించింది. క్యాన్సర్​ నియంత్రణ, అవసరమైన జాగ్రత్తలకు తక్కువ వ్యయం చేయడమే దీనికి కారణమని వెల్లడించింది. 'ప్రపంచ క్యాన్సర్ దినం' సందర్భంగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు పేర్కొంది డబ్ల్యూహెచ్​ఓ.

WHO forecasts 81% cancer jump in poorer countries
ఆ దేశాల్లో 81 శాతం పెరగనున్న క్యాన్సర్​ కేసులు!
author img

By

Published : Feb 4, 2020, 11:29 AM IST

Updated : Feb 29, 2020, 3:08 AM IST

2040 నాటికి అల్ప, మధ్య స్థాయి ఆదాయ దేశాల్లో 81 శాతం మేర క్యాన్సర్​ కేసులు పెరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) హెచ్చరించింది. క్యాన్సర్​ నివారణ, నియంత్రణ దిశగా ఖర్చు చేసే వ్యయం తగ్గడమే ఇందుకు కారణమని తెలిపింది. 'ప్రపంచ క్యాన్సర్ దినం' సందర్భంగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది.

తక్కువ, మధ్య ఆదాయ దేశాలు క్యాన్స​ర్​పై పోరాటాన్ని నిలిపేసి..అంటు వ్యాధులను ఎదుర్కోవడం, తల్లి, పిల్లల ఆరోగ్య సంరక్షణపై దృష్టి కేంద్రీకరించాయని స్పష్టం చేసింది డబ్ల్యూహెచ్​ఓ. అయితే పొగాకు వల్లే 25 శాతం క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది.

"ప్రజలకు ప్రాథమిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటే క్యాన్సర్​ను ముందుగానే గుర్తించొచ్చు. సమర్థవంతంగా చికిత్స చేసి.. నయం చెయ్యొచ్చు. క్యాన్సర్​ కారణంగా ఎవరూ మరణించకూడదు."

-రెన్​ మింగుయి​, డబ్ల్యూహెచ్​ఓ అదనపు​ డైరెక్టర్​ జనరల్

రానున్న దశాబ్దంలో 25 బిలియన్​ డాలర్లు వ్యయం చేసి 70 లక్షల మందిని క్యాన్సర్​ నుంచి రక్షించగలమని డబ్ల్యూహెచ్​ఓ ఉద్ఘాటించింది. క్యాన్సర్​ నియంత్రణకు పెద్ద మొత్తంలో ఖర్చు కాబోదని అభిప్రాయపడింది.

అధిక ఆదాయ దేశాల్లో అందిన మెరుగైన క్యాన్సర్​ చికిత్సలతో 2000- 2015 మధ్య కాలంలో 20 శాతం మేర మరణాలు తగ్గినట్లు చెప్పింది డబ్ల్యూహెచ్​ఓ. అయితే పేద దేశాల్లో 5 శాతం మాత్రమే తగ్గినట్లు పేర్కొంది.

Intro:Body:

translator story 

Conclusion:
Last Updated : Feb 29, 2020, 3:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.