ETV Bharat / international

'హైడ్రాక్సీ' ట్రయల్స్​ బంద్​: డబ్ల్యూహెచ్​ఓ

author img

By

Published : Jul 5, 2020, 11:10 AM IST

Updated : Jul 5, 2020, 11:59 AM IST

హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్రయల్స్ నిలిపివేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ ఔషధం వల్ల కరోనా రోగులు గొప్పగా కోలుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్​ఓ పేర్కొంది. అయితే తాజా ప్రకటన వల్ల ఇప్పటి వరకు.. ఈ మలేరియా ఔషధాన్ని తీసుకున్న రోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేసింది.

WHO ending hydroxycholorquine trial for COVID
హైడ్రాక్సీక్లోరోక్లిన్ ట్రయల్స్​కు ముగింపు: డబ్ల్యూహెచ్​ఓ

కరోనా రోగుల చికిత్స కోసం ఇప్పటి వరకు ఉపయోగిస్తూ వస్తున్న మలేరియా నివారణ ఔషధం 'హైడ్రాక్సీక్లోరోక్విన్'పై​... ట్రయల్స్​ను నిలిపివేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) తెలిపింది.

"హెచ్​ఐవీ/ఎయిడ్స్ చికిత్సకు ఉపయోగించే ఔషధాలైన లోపినావిర్​/ రిటోవినార్​, అలాగే హైడ్రాక్సీక్లోరోక్విన్​లపై... ట్రయల్స్ నిలివేయాలని పర్యవేక్షణ కమిటీ చేసిన సిఫార్సులను ఆమోదించాం."

- ప్రపంచ ఆరోగ్య సంస్థ

మరణాలు తగ్గించలేకపోయాయ్

హైడ్రాక్సీక్లోరోక్విన్ వల్ల కరోనా రోగులకు నయమవుతుందా? లేదా? అనేదానిపై విచారణ ముగించినట్లు డబ్ల్యూహెచ్​ఓ స్పష్టం చేసింది. మిగతా మందులతో పోల్చి చూసినప్పుడు వీటి పనితీరు ఏమంత గొప్పగా లేదని స్పష్టం చేసింది. ఈ ఔషధాలు వైరస్ ప్రభావాన్ని కానీ, మరణాలను కానీ తగ్గించలేకపోయాయని వెల్లడించింది.

అందుకు ఆధారం లేదు

హైడ్రాక్సీక్లోరోక్విన్​తో చికిత్స పొందిన రోగుల్లో మరణాలు పెరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్​ఓ పేర్కొంది. అయితే కొంతమేరకు కొవిడ్ రోగులు కోలుకోవడానికి సహాయపడినట్లు కొన్ని ట్రయల్స్​లో నిరూపితమైందని వెల్లడించింది.

హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్రయల్స్​కు ముగింపు పలుకుతున్నట్లు తాము చేసిన ప్రకటన వల్ల... ఆసుపత్రుల్లో ఉంటూ ఇప్పటి వరకు ఆ మందులు తీసుకుంటున్న రోగులకుగానీ, ఇళ్లలోనే ఉంటూ ఔషధం తీసుకుంటున్నవారికి గానీ ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: రికార్డ్: ఒక్కరోజులో 24 వేల 850 కేసులు, 613 మరణాలు

Last Updated : Jul 5, 2020, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.