ETV Bharat / international

'ప్రపంచవ్యాప్తంగా తీవ్రతరమవుతున్న మహమ్మారి' - who on corona conditions

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రతరమవుతున్నాయని వెల్లడించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) అధ్యక్షుడు టెడ్రోస్ అధానోం. అమెరికా, దక్షిణాసియాల్లోని 10 దేశాల్లోనే 75 శాతం కేసులు నమోదయినట్లు చెప్పారు. ఆదివారం ఒక్కరోజే 1,36,000 కేసులు పెరిగినట్లు తెలిపారు. అయితే కొన్ని దేశాల్లో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉందని పేర్కొన్నారు.

who
'ప్రపంచవ్యాప్తంగా తీవ్రతరమవుతున్న మహమ్మారి'
author img

By

Published : Jun 9, 2020, 5:24 AM IST

కరోనా వైరస్ వ్యాప్తిపై కీలక ప్రకటన చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) అధ్యక్షుడు టెడ్రోస్ అధానోం. ప్రపంచవ్యాప్తంగా వైరస్ తీవ్రతరమవుతోందని వ్యాఖ్యానించారు. అయితే ఐరోపాలో పరిస్థితులు మెరుగవుతున్నాయని చెప్పారు.

75శాతం కేసులు అమెరికా, దక్షిణాసియాలోని 10 దేశాల్లోనే నమోదయ్యాయని వెల్లడించారు. గత తొమ్మిదిరోజుల్లో 1,00,000 పైగా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఆదివారం ఒక్కరోజే అత్యధికంగా 1,36,000 కేసులు నిర్ధరణ అయ్యాయని తెలిపారు. ఆఫ్రికాలోని అనేక దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని.. అయితే కొన్ని దేశాల్లో కేసుల సంఖ్య 1,000 లోపే ఉన్నట్లు స్పష్టం చేశారు.

దొంగ కరోనాతో వ్యాప్తి స్వల్పమే..

ఎలాంటి లక్షణాలు లేని దొంగ కరోనా బాధితుల నుంచి ఇతరులకు వైరస్ సంక్రమించడం అరుదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. లక్షణాలు లేని వారి ద్వారా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందని.. అందుకే మహమ్మారికి అడ్డుకట్ట పడటం లేదని ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిని డబ్ల్యూహెచ్​ఓ కరోనా సాంకేతిక విభాగం ఉన్నతాధికారి మారియా వాన్ కెర్ఖోవ్ ఖండించారు. లక్షణాలు లేని బాధితుల నుంచి ఇతరులకు చాలా స్వల్పస్థాయిలోనే వైరస్ సోకుతోందని.. గరిష్ఠంగా ఇది 6 శాతం వరకూ ఉంటుందని వెల్లడించారు.

ఇదీ చూడండి: భారత్​తో సరిహద్దు రగడపై చైనా శాంతి మంత్రం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.