ETV Bharat / international

WHO Chief: 'బూస్టర్‌ డోసులకు తొందరపడొద్దు'

WHO Chief: బూస్టర్​ డోసుల కోసం తొందరపడొద్దని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. బుధవారం ఆన్‌లైన్‌ న్యూస్‌ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన డబ్ల్యూహెచ్​ఓ ఛీఫ్ టెడ్రోస్ అథనోమ్.. ప్రపంచవ్యాప్తంగా పూర్తిస్థాయి వ్యాక్సినేషన్​ జరిగితేనే మహమ్మారిని అరికట్టగలమని అన్నారు.

WHO
డబ్ల్యూహెచ్​ఓ
author img

By

Published : Dec 23, 2021, 5:54 AM IST

WHO Chief: కొవిడ్‌-19 అంతానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాన్ని బూస్టర్‌ డోసుల కోసం ధనిక దేశాలు చూపుతున్న ఆత్రుత మరింత ప్రమాదంలోకి నెట్టివేస్తుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూ హెచ్‌ఓ) హెచ్చరించింది. 'ఏకపక్షంగా వెళ్లి ఏ దేశం కూడా ఈ మహమ్మారిని జయించలేదు' అని స్పష్టం చేసింది.

డబ్ల్యూ హెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్ గేబ్రియేసెస్‌ బుధవారం ఆన్‌లైన్‌ న్యూస్‌ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. 'ఆసుపత్రిలో చేరేవారిలో, కొవిడ్ మృతుల్లో.. వ్యాక్సిన్ తీసుకోనివారి సంఖ్యే ఎక్కువగా ఉంది. బూస్టర్​ డోసు తీసుకోనివారి సంఖ్య కాదు.' అని తెలిపారు.

ఒమిక్రాన్​ వేరియంట్​ వ్యాప్తి దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అథనోమ్. 2021లో దాదాపు 35 లక్షల మంది కొవిడ్​ కారణంగా ప్రాణాలు విడిచారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్​ జరిగితేనే మహమ్మారి వ్యాప్తికి ముగింపు అని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:

'89 దేశాల్లో ఒమిక్రాన్.. అలాంటి చర్యలతోనే అడ్డుకట్ట'

'చైనా మరింత సమాచారం ఇస్తేనే కొవిడ్​పై పోరాటంలో ముందడుగు'

'పేదరికంలోకి 50 కోట్లకుపైగా ప్రజలు- ఇక సమయం లేదు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.