ETV Bharat / international

ఆకలితో అడవుల్లోంచి వేల కి.మీ. నడక- అయినా అనుమతించని అమెరికా! - haiti crisis

అసలే పేద దేశం.. వరుస విపత్తులు.. ఆపై అధ్యక్షుడి హత్య.. అల్లర్లు.. ముదిరిన సంక్షోభం.. చేసేదేం లేదు. అందుకే పొట్టచేత పట్టుకొని నడక ప్రారంభించారు. ఎలాగో అమెరికా- మెక్సికో సరిహద్దులకు (US Mexico border news) చేరుకున్నారు. తమ గోడు విని.. పరిస్థితి చూసి.. ఆ దేశాలు ఆశ్రయం ఇస్తాయనుకున్నారు. జరిగింది వేరు. వచ్చిన దారినే వెళ్లాలని ఆదేశాలు. గుర్రాలతో దాడులు.. బలవంతంగా విమానాలు ఎక్కించడం.. ఇదీ అగ్రరాజ్యం తీరు. ఇలా వెనక్కి వెళ్లే ధైర్యం లేక.. ముందుకు వెళ్లే దారిలేక.. అగమ్యగోచరంగా తయారైంది హైతీ వాసుల (Haiti news today) పరిస్థితి. టెక్సాస్​ సరిహద్దులోని (Texas border crisis) డెల్​ రియో వంతెన కింద ఇంకా వేలాది మంది హైతీయన్లు (Haiti news).. దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ముందు గొయ్యి.. వెనక నుయ్యి అన్న చందంలా తయారైంది వీళ్ల పరిస్థితి.

Haitian migrants
హైతీ కల్లోలం, హైతీ వార్తలు
author img

By

Published : Sep 22, 2021, 7:16 PM IST

హైతీ సంక్షోభంతో.. అమెరికాకు వలసబాట

వరుస భూకంపాలు (Haiti Earthquake).. భారీ వరదలు.. ఇలా వరుస విపత్తులతో ఉత్తర అమెరికా దేశం హైతీ(Haiti news) అట్టుడికిపోయింది. ఆపై అధ్యక్షుడి హత్య (Haiti President Assassinated) దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టింది. పొట్టచేత పట్టుకొని.. వలస బాట పట్టారు హైతీయన్లు. వేలాది మంది.. హైతీ సరిహద్దుల్లోని మెక్సికో, అమెరికాకు తరలివెళ్లారు. మెక్సికో ఆంక్షలతో.. ఈ రెండు దేశాలను(అమెరికా, మెక్సికో) వేరుచేసే రియో గ్రాండి నది మీదుగా యూఎస్​లోని టెక్సాస్​​ సరిహద్దులకు (Texas border crisis) చేరుకున్నారు. వారంతా తాళ్ల సాయంతో.. నది దాటుతున్న దృశ్యాలను డ్రోన్​ కెమెరాలు చిత్రీకరించాయి.

Haitian migrants
నదిలోనే వందలాది వలసదారులు
Haitian migrants
తాళ్లు కట్టి.. నది దాటుతూ..
Haitian migrants
నదిలో వలసదారులు.. డ్రోన్​ చిత్రాలు

అక్కడే మెక్సికో- టెక్సాస్​ సరిహద్దుల్లో (US Mexico border news) వేలాది మంది హైతీయన్లు తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసుకొని.. అమెరికా ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ వారి ఆశలు ఫలించలేదు.

Haitian migrants
టెక్సాస్​ సరిహద్దుల్లో తాత్కాలిక శిబిరాలు
Haitian migrants
గుంపులుగుంపులుగా నది దాటుతున్న హైతీ వాసులు

ఇప్పుడీ చొరబాట్లను అడ్డుకునేందుకు.. అమెరికా కూడా చర్యలకు ఉపక్రమించింది. వారిని తిరిగి హైతీకి పంపేందుకు.. ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది జో బైడెన్​ సర్కార్​(Joe Biden news). ఈ క్రమంలోనే.. దిక్కుతోచని స్థితిలో పడిపోయారు హైతీ వాసులు.

ఎటు వెళ్లాలో తెలియక వీరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. చేసేదేంలేక కొందరు మెక్సికో వైపు, మరికొందరు అమెరికా వైపు మళ్లుతున్నారు. తిండీతిప్పలు లేక అల్లాడిపోతున్నారు.

Haitian migrants
కట్టుబట్టలతో.. కుటుంబాలతో.. ఎక్కడికి వెళ్తారో..?

హైతీయన్లపై అమెరికా సరిహద్దు (US border crisis) సిబ్బంది దాడుల పట్ల రిపబ్లికన్ల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. హైతీ(Haiti news) వాసులను చెదరగొట్టేందుకు.. వారిని గుర్రాలతో వెంబడించారు బోర్డర్​ ఏజెంట్లు. బలవంతంగా విమానాల్లోకి ఎక్కిస్తున్నారు. దీనిని తప్పుబడుతున్న రిపబ్లికన్లు.. సంక్షోభాన్ని ఎదుర్కోలేక బైడెన్​ చేతులెత్తేశారని ఆరోపిస్తున్నారు.

Haitian migrants
గుర్రాలతో వలసదారులపైకి దూసుకెళ్తూ..
Haitian migrants
గుర్రాలతో దాడులు
Haitian migrants
గుర్రాలతో అమెరికా సిబ్బంది

ఓవైపు ఆంక్షలు.. వెనక్కివెళ్లాలని ఆదేశాలు.. మరోవైపు ఆకలికేకలు.. ఏం చేయాలో తెలియదు. ఎటు వెళ్లాలో స్పష్టత లేదు. ఇలా ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే.

Haitian migrants
అమెరికా ఆశ్రయం కోసం ఎదురుచూపులు

అయితే.. ఈ కఠిన పరిస్థితులు.. తమకూ సవాల్​ విసురుతున్నాయని అంటున్నారు యూఎస్​ డిపార్ట్​మెంట్​ ఆఫ్​ హోమ్​ల్యాండ్​ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో మయోర్కస్​. అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించే హైతీయన్లు తమ కుటుంబాలను ప్రమాదంలోకి నెట్టకుండా, తిరిగి వెనక్కి వెళ్లడమే మంచిదని హెచ్చరించారు.

Haitian migrants
నడుములోతు నీటిలో నడుస్తున్న వలసదారులు
Haitian migrants
వంతెన కిందే వేలాది మంది ఆశ్రయం

'మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..'

టెక్సాస్​ సరిహద్దు నగరం(Texas border crisis) డెల్​ రియోలోని (Del Rio border crossing) ఒక్క వంతెన కిందే.. 14 వేల మందికిపైగా వలసదారులు ఉన్నారు. దాదాపు 6 వేల మందిని హైతీకి పంపించామని, మరో 8 వేలమందికిపైగా ఇంకా ఉన్నారని అన్నారు టెక్సాస్​ గవర్నర్, రిపబ్లికన్​​ గ్రెగ్​ అబాట్​. సమస్యకు పరిష్కారం కనుగొనాలని.. చట్ట ప్రకారం నడుచుకోవాలని దేశ అధ్యక్షుడికి సూచించారు. వలసదారుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని హితబోధ చేశారు.

''ఈ వలసదారులను అందరినీ తరలించే ప్రక్రియను ఈ వారం చివర్లోగా పూర్తి చేసే సామర్థ్యం బైడెన్​ సర్కార్​కు లేదు. వారు చేయగలిగేది ఏంటంటే.. అసలు ఇది ఉనికిలోనే లేదని నిక్కచ్చిగా చెప్పగలిగే అసమర్థత. కానీ.. వలసదారులతో గందరగోళం నెలకొంది అని తెలియపర్చడానికే మేం ఇక్కడ ఉన్నాం. అయితే.. బైడెన్​ యంత్రాంగం సరైన రీతిలో వ్యవహరించాలి.''

- గ్రెగ్​ అబాట్​, టెక్సాస్​ గవర్నర్​

మెక్సికో కాస్త బెటర్​..

వలసదారుల పట్ల మెక్సికో ప్రభుత్వం.. కాస్త మానవత్వంతో వ్యవహరిస్తోంది. తమ వైపున్న రియో గ్రాండి నది వద్దకు చేరుకున్న హైతీయన్ల(Haiti news) కోసం వైద్య శిబిరం ఏర్పాటు చేయడమే కాకుండా.. వారికి ఆహారం కూడా అందిస్తోంది.

Haitian migrants
మెక్సికో క్యాంప్​

ముఖ్యంగా కరోనా పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడటమే తమకు ముఖ్యమని అక్కడి ఓ నర్సు తెలిపారు. మెక్సికో కూడా.. వలసదారులను తగ్గించుకునేందుకు ప్రత్యేక ఫ్లైట్లు ఏర్పాటు చేసింది. దశలవారీగా వారిని వెనక్కి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది.

Haitian migrants
.

దశాబ్దకాలంగా..

2010లో సంభవించిన భారీ భూకంపం (Haiti Earthquake 2010) అనంతరం.. హైతీ నుంచి అమెరికాకు వలసలు పోటెత్తాయి. ఆ ప్రకృతి విపత్తు ధాటికి.. సుమారు 2 లక్షల మంది మరణించారు. 2016 రియో ఒలింపిక్స్​ తర్వాత.. వలసలు ఇంకా పెరిగాయి. ఒలింపిక్స్​ తర్వాత ఉపాధి కోల్పోయి.. దిక్కుతోచని స్థితిలో ప్రమాదకర పనామా అడవి మీదుగా కాలినడకన కొందరు.. కార్లు, బస్సుల్లో ఇంకొందరు.. యూఎస్​ సరిహద్దులకు వచ్చారు. ఒక్క మెక్సికోలోనే ఆశ్రయం కోసం.. 19 వేలమందికిపైగా హైతీయన్లు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.

అధ్యక్షుడి హత్య అనంతరం.. హైతీ రాజధానిలో వీధులపై ఆధిపత్యం కోసం ముఠాల మధ్య ఘర్షణలు కూడా ఎక్కువయ్యాయి. రాజధాని మూడో వంతు వీరి అధీనంలోనే ఉంది. ఈ కారణంగానే వేలాది మంది నిరాశ్రయులు.. మళ్లీ అక్కడికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు.

ఇవీ చూడండి: జైలు గోడలు బద్దలు కొట్టి 400 మంది ఖైదీలు పరార్​

ఇంట్లోకి చొరబడి దేశాధ్యక్షుడి హత్య

ఆర్థిక సంక్షోభంతో దుకాణాలనే దోచేస్తున్నారు..!

హైతీ భూకంపం భయానక దృశ్యాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.