భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్ ఖాతాలను వైట్‌హౌస్ అన్‌ఫాలో చేయగా... సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ మేరకు భారతీయుల నుంచి సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న వ్యాఖ్యలపై శ్వేతసౌధం స్పందించింది. విదేశీ పర్యటనల సమయంలో అమెరికా అధ్యక్ష భవనం ఆయా దేశాధినేతలు, వారి కార్యాలయాలను.. ట్విట్టర్లో తాత్కాలికంగా మాత్రమే అనుసరిస్తుందని స్పష్టం చేసింది. పర్యటన పూర్తయ్యాక వీటిని అన్‌ఫాలో చేయడం సాధారణ ప్రక్రియ అని ఓ ప్రకటనలో తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఫిబ్రవరిలో భారత్ పర్యటన సందర్భంగా వైట్‌హౌస్ కార్యాలయం ప్రధాని మోదీతో పాటు ఆరుగురి ట్విట్టర్ ఖాతాలను అనుసరించింది. ప్రస్తుతం వైట్‌హౌస్.. కేవలం అక్కడి 13 ఖాతాలను అనుసరిస్తోంది. అయితే శ్వేతసౌధం ఖాతను మాత్రం సుమారు 2 కోట్ల మంది ఫాలో అవుతున్నారు.
ఇదీ చదవండి: దటీజ్ మోదీ... వైట్‌హౌస్ కూడా ఆయనకు ఫాలోవరే!