ETV Bharat / international

రష్యాను భయపెట్టే ఆయుధం ఇదేనా..? - స్విఫ్ట్‌ అనగానేమి?

What is Swift?: ఉక్రెయిన్‌ అంశంలో దూకుడుగా ప్రవర్తిస్తున్న రష్యాను కట్టడి చేయాలని అమెరికా యోచిస్తోంది. అయితే.. రష్యాను కట్టడి చేయడానికి అమెరికా ఎదుట ఉన్న బలమైన మార్గం 'స్విఫ్ట్‌' (సొసైటీ ఫర్‌ వరల్డ్‌వైడ్‌ ఇంటర్‌ బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ టెలి కమ్యూనికేషన్‌ సిస్టమ్‌) నుంచి బయటకు పంపించడమే. ఫలితంగా రష్యా అంతర్జాతీయ వాణిజ్యంలో సమస్యలు తలెత్తి ఆర్థిక వ్యవస్థపై పెనుప్రభావం పడే ప్రమాదం ఉంది.

What is Swift?
పుతిన్
author img

By

Published : Feb 10, 2022, 5:33 AM IST

What is Swift?: ఉక్రెయిన్‌ సంక్షోభం ముదిరే కొద్దీ అమెరికాకు తలనొప్పులు పెరుగుతున్నాయి. రష్యా దూకుడును ఎలా కట్టడి చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తాజాగా పుతిన్‌ మాట్లాడుతూ.. నాటో బలగాలతో పోలిస్తే రష్యా ఆయుధ శక్తి తక్కువే.. కానీ, అణ్వాయుధాల్లో మాత్రం ప్రబల శక్తి అన్న విషయాన్ని గుర్తు చేశారు. ఓ రకంగా పరోక్ష అణుబెదిరింపులకు ఇదే మాత్రం తీసిపోదు. ఇదే సమయంలో రష్యాను కట్టడి చేయడానికి అమెరికా ఎదుట ఉన్న బలమైన మార్గం 'స్విఫ్ట్‌' (సొసైటీ ఫర్‌ వరల్డ్‌వైడ్‌ ఇంటర్‌ బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ టెలి కమ్యూనికేషన్‌ సిస్టమ్‌) నుంచి బయటకు పంపించడమే. ఫలితంగా రష్యా అంతర్జాతీయ వాణిజ్యంలో సమస్యలు తలెత్తి ఆర్థిక వ్యవస్థపై పెనుప్రభావం పడే ప్రమాదం ఉంది.

ఏమిటీ స్విఫ్ట్‌..?

What is Swift?: ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లావాదేవీల సమాచారాన్ని అత్యంత కచ్చితత్వంతో మార్పిడి చేసుకొవడానికి ఉపయోగించే నెట్‌వర్కింగ్‌ వ్యవస్థ. దీని ప్రధాన కార్యాలయం ఐరోపా సమాఖ్యలోని బెల్జియంలో ఉంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా రెండు వందలకుపై దేశాలకు చెందిన 11,000 వేల బ్యాంకింగ్‌, సెక్యూరిటీ ఆర్గనైజేషన్స్‌ను అనుసంధానిస్తుంది.
సభ్యులైన ప్రతి సంస్థకు బ్యాంకింగ్‌ ఐడెంటిఫికేషన్‌ కోడ్‌ (స్విఫ్ట్‌ కోడ్‌)ను కేటాయిస్తారు. ఉదాహరణకు న్యూయార్క్‌లోని ఒక బ్యాంక్‌ నుంచి లండన్లోని ఓ బ్యాంక్‌లో ఖాతా తెరిచిన వినియోగదారుడు డబ్బులు తేలిగ్గా పంపవచ్చు. న్యూయార్క్‌లోని చెల్లింపుదారుడు తన బ్యాంక్‌కు సొమ్ము చెల్లించి లండన్‌లోని స్వీకర్త బ్యాంక్‌ స్విఫ్ట్‌ నెంబర్‌, ఖాతా వివరాలు ఇవ్వాలి. అప్పుడు న్యూయార్క్‌లోని బ్యాంక్‌ నుంచి లండన్‌లోని బ్యాంక్‌కు స్విఫ్ట్‌ సందేశం వెళుతుంది. ఆ తర్వాత లండన్‌లోని బ్యాంక్‌ నుంచి స్వీకర్తకు సొమ్ము అందుతుంది. స్విఫ్ట్‌ మార్గంలో కేవలం సందేశాలను మాత్రమే పంపిస్తుంది. నగదు, ఇతర సెక్యూరిటీలను బదలాయించదు.

స్విఫ్ట్‌ సంస్థ 2021 లెక్కల ప్రకారం రోజుకు 42 మిలియన్ల సందేశాలను పరిశీలిస్తుంది. ఏటా ఈ సంఖ్య 11.4శాతం పెరుగుతోంది. ఐరోపా సమాఖ్య, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలు కలిపి 4.66 బిలియన్ల సందేశాలను పంపుతున్నాయి. ఇక అమెరికా, యూకే 4.42 బిలియన్ల సందేశాలను స్విఫ్ట్‌ద్వారా పంపుతున్నాయి.

అమెరికా-రష్యా వివాదంలో..

ఉక్రెయిన్‌ వద్ద రష్యా తీరు మారకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని సోమవారం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ హెచ్చరించారు. రష్యా నుంచి జర్మనీకి గ్యాస్‌ సరఫరా చేసే 'నార్డ్‌స్ట్రీమ్‌ పైప్‌లైన్‌-2'పై ఆంక్షలు విధిస్తామని తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు జర్మనీ ఎనర్జీ రెగ్యూలేటరీ నుంచి అనుమతులు కూడా లభించలేదు. మరోపక్క ఐరోపా సమాఖ్యలోని చాలా దేశాలు రష్యా గ్యాస్‌పై ఆధారపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ వద్ద ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఆ దేశాలు తీవ్ర యత్నాలు చేస్తున్నాయి.

అమెరికా చివరి ఆయుధంగా స్విఫ్ట్‌ నుంచి రష్యాను పక్కకు తప్పించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జనవరి 17వ తేదీన ఓ జర్మనీ పత్రిక మాత్రం ఇటువంటి అవకాశం లేదని కథనం ప్రచురించింది. కానీ, ఆ మర్నాడే వైట్‌ హౌస్‌ స్పందిస్తూ అమెరికా ఎదుట ఉన్న అవకాశాల్లో 'స్విఫ్ట్‌' ఆంక్షలు కూడా ఒకటని వెల్లడించింది.

రష్యాను తప్పిస్తే..

Swift Uses: రష్యాను స్విఫ్ట్‌ నుంచి తప్పిస్తే విదేశాల నుంచి ఆ దేశానికి నిధులు అందడం కష్టమైపోతుంది. దేశీయ ఇన్వెస్టర్లపైనే ఆధారపడి ఉండాలి. దీనికి సరైన ప్రత్యామ్నాయ వ్యవస్థ కూడా లేదు. 1973లో ప్రారంభమైన స్విఫ్ట్‌ 1978లో 518 సంస్థల్లో వినియోగంలోకి వచ్చింది. స్విఫ్ట్‌కు ప్రత్యామ్నాయంగా చెప్పుకొనే టెలెక్స్ వ్యవస్థ చాలా నిదానంగా ఉంటుందన్న పేరుంది.

స్విఫ్ట్‌ తొలగించిన దేశాలున్నాయా..

2018లో ఇరాన్‌ను స్విఫ్ట్‌నుంచి తొలగించారు. అప్పట్లో ఈ చర్యను ఐరోపా సమాఖ్యలోని చాలా దేశాలు వ్యతిరేకించాయి. వీలైనంత వరకు ప్రపంచ రాజకీయాలకు దూరంగా ఉండాలని ఈ సంస్థ భావిస్తుంది. ఇరాన్‌ను తొలగించిన సమయంలో కూడా విచారం వ్యక్తం చేసింది. స్విఫ్ట్‌ కార్యకలాపాలను ఎంపిక చేసిన 25 మంది సభ్యుల బోర్డు పర్యవేక్షిస్తుంది.

ఇదీ చదవండి: డ్రాగన్​ వైపు రష్యా మొగ్గు.. బలపడుతున్న బంధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.