కరోనా మహమ్మారికి ఇప్పటివరకు సరైన చికిత్స లేదు. అయితే రోగుల ప్రాణాలు కాపాడేందుకు వైరస్ తీవ్రత ఆధారంగా ఏఏ ఔషాధాలు వినియోగించాలనే విషయంపై మార్గదర్శకాలున్నాయి. తాజా అధ్యయనాలు పరిగణనలోకి తీసుకుని వీటికి సవరణలు చేసింది అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ. ఆస్పత్రులలో చేరిన రోగులకు ఎలాంటి చికిత్సలు అందించాలో వివరించింది.
నూతన మార్గదర్శకాల ప్రకారం చికిత్సలు ఇలా...
- కరోనా సోకి ఆరోగ్యం తీవ్రంగా విషమించిన వారికి డెక్సామెథాసోన్ వంటి స్టెరాయిడ్లు ఇవ్వచ్చు. అయితే స్వల్ప లక్షణాలు ఉన్నావారికి మాత్రం వీటి అవసరం అసలు లేదు.
- హోంక్వారంటైన్లో ఉన్నవారు.. ఆస్పత్రుల్లో చేరి ఆక్సిజన్ అవసరం లేని వారికి నిర్దిష్ట డ్రగ్స్ ఏమీ లేవు. స్టెరాయిడ్స్ వినియోగించవద్దు.
- ఆస్పత్రుల్లో చేరి ఆక్సిజన్ అవసరం ఉన్నవారికి రెమిడెసివిర్, స్టెరాయిడ్ ఇవ్వాలి.
- ప్లాస్మా థెరపీ వల్ల ప్రయోజనం ఉంటుందో లేదో తెలియదు. దానిని వినియోగించాలా? వద్దా? అనే విషయంపై ఏ నిర్ణయం తీసుకోలేదు.
- హైడ్రాక్సీక్లోరోక్విన్, రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేసే డ్రగ్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
- ఇవే కాకుండా ఆస్పత్రులలో చేరే రోగులకు వెంటిలేటర్ల అవసరాన్ని నివారించే వైద్యుల సలహాలు, సూచనలు పాటించవచ్చు.