ETV Bharat / international

క్రియాశీలక రాజకీయాల్లో ట్రంప్​.. ఆట ఆరంభం!

author img

By

Published : Jun 6, 2021, 8:40 AM IST

అమెరికా అధ్యక్షుడిగా వైదొలిగిన తర్వాత 2024 ఎన్నికల కోసం ఊవ్విళ్లూరుతున్న డొనాల్డ్​ ట్రంప్​.. క్రియాశీలకంగా పనిచేయడం ప్రారంభించారు. వచ్చే ఏడాది జరగనున్న మధ్యంతర ఎన్నికల కోసం ప్రచారంతో రిపబ్లికన్​ పార్టీని తన అధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Donald Trump
డొనాల్డ్ ట్రంప్

2022 మధ్యంతర ఎన్నికల్లో తనకు విధేయంగా ఉండే అభ్యర్థులకు మద్దతివ్వాలని రిపబ్లికన్లను కోరారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అధ్యక్షుడిగా వైదొలిగిన తర్వాత 2024లో మరోసారి పోటీ చేస్తానని ఇదివరకే సంకేతాలు ఇచ్చిన ట్రంప్​.. ఆ దిశగా ముందడుగు వేశారు. పార్టీని తన అధీనంలోకి తెచ్చుకోవడానికి క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు వందలాది రిపబ్లికన్​ నేతలు, కార్యకర్తలతో నార్త్​ కరోలినా రిపబ్లికన్​ కన్వెన్షన్​లో ఆయన సమావేశమయ్యారు.

"2024లో నార్త్​ కరోలినాను గెలవబోతున్నాం. అందుకోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తాం. వచ్చే ఏడాది మధ్యంతర ఎన్నికల నుంచి ప్రతి స్థాయిలో రిపబ్లికన్లను ఎన్నుకోవడం పైనే అమెరికా మనుగడ ఆధారపడి ఉంది."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు

రిపబ్లికన్లకు నార్త్​ కరోలినా కంచుకోటగా ఉంది. గత 13 అధ్యక్ష ఎన్నికల్లో 11 సార్లు ఓటర్లు ఆ పార్టీకే పట్టం కట్టారు.

ఇదీ చూడండి: 'జో బైడెన్​ కంటే ట్రంపే బెటర్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.