సొంత ప్రజల కన్నా ప్రపంచ దేశాలకే ఎక్కువ కరోనా టీకాలను అందించినట్లు ఐక్యరాజ్య సమితికి తెలిపింది భారత్. వైరస్ను అరికట్టాలనే లక్ష్యాన్ని వ్యాక్సిన్ అందుబాటులో ఉండే విషయంలో అసమానత దెబ్బతీస్తోందని శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో అభిప్రాయపడింది. దాని ప్రభావం పేద దేశాలపై అధికంగా పడుతుందని హెచ్చరించింది.
కరోనా మహహ్మరి ఇంకా అంతం కాకున్నా.. టీకాల ఆవిష్కరణతో 2021 సానుకూలంగా ప్రారంభమైందని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి కె. నాగరాజు నాయుడు చెప్పారు. అయితే వ్యాక్సిన్ సవాలును అధిగమించినా.. దానిని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారించాలని సభ్యదేశాలను కోరారు.
రాబోయే 6 ఏళ్లలో దేశ ప్రజలకు 30 కోట్ల టీకాలను అందించడమే కాకుండా 70కి పేగా దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేయాలని భారత్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు నాయుడు తెలిపారు.
ఇదీ చూడండి: దేశంలో 5.69 కోట్ల టీకా డోసులు పంపిణీ