తన జుట్టుతోనే వార్తల్లో నిలిచిందో యువతి. ఏళ్లుగా పెంచుకున్న ఆ బారెడు జడనే డ్రెస్సుగా మలచుకుంది. ఆమె ఫొటోలు చూసిన నెటిజన్లు.. అంత పెద్దగా ఎలా పెరిగిందబ్బా అని ఆశ్చర్యపోతున్నారు.
సన్‌గ్లాసెస్, టోపీ ధరించినా.. ఆ యువతి డ్రెస్సుపైనే అందరి దృష్టి పడింది. పొడుగ్గా పెరిగిన జుట్టును.. మధ్యలో బెల్టుతో బిగించి మోకాళ్లపైభాగం వరకు సర్దేసింది. యువతి స్టైలిష్ లుక్‌తో ఉన్న ఆ వీడియోను.. హెప్గల్5(hepgul5) అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వినూత్న వీడియోకు నెట్టింట మంచి స్పందన లభిస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. కొందరు విచిత్రంగా ఉందని చెప్పగా, ఇంటర్నెట్లో వైరల్ అయ్యేందుకు విగ్‌తో అలా చేయలేదుకదా అని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండి: పట్టు లాంటి జుట్టు కోసం.. ఇంట్లోనే ఈ నూనెను తయారు చేసుకోండి!