ETV Bharat / international

కారు దిగకుండానే ఓటేసి వెళ్లిపోవచ్చు! - america elecitons 2020

నవంబర్​లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి స్కూళ్లు, చర్చిలు, ప్రభుత్వ భవనాలు, మైదానాల్లోనూ ఓటింగ్​ నిర్వహణకు అనుమతులు ఇస్తున్నారు. వీటితో పాటు డ్రైవ్​ థ్రూ, ఔట్​ డోర్​ పోలింగ్​ విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు.

Voting in person Nov. 3? Expect drive-thrus, sports arenas
అమెరికా ఎన్నికలు: కారు దిగకుండానే ఓటేసి వెళ్లిపోవచ్చా..?
author img

By

Published : Sep 6, 2020, 5:28 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. అగ్రరాజ్యాధినేత ఎవరో నిర్ణయించే ఎన్నికలు నవంబర్​ 3న జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మెయిల్​-ఇన్​ ఓటింగ్​ వైపు ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నట్లు గతంలో పలు నివేదికలు స్పష్టం చేశాయి. అయితే ఈ తరహా విధానంతో అవినీతి జరుగుతుందని ట్రంప్​ ప్రభుత్వం భావించింది. ఫలితంగా మెయిల్​ ఇన్​ ఓటింగ్​ విధానాల్లో మార్పులు చేసింది. దీంతో చాలా మంది ప్రత్యక్ష ఓటింగ్​లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారంతా భారీ హాళ్లు, బహిరంగ ప్రదేశాలు, క్రీడా మైదానాల్లో ఓట్లు​ వేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం.

తొలిసారి..?

నవంబర్​లో ఓటింగ్​ ఎప్పటిలా కాకుండా కాస్త విభిన్నంగా ఉండనుంది. ప్రతి రాష్ట్రంలోనూ మైదానాలు, సినిమా థియేటర్లలోనూ ప్రత్యక్షంగా ఓటు​ వేసేందుకు అవకాశం ఉంది. మెయిల్​-ఇన్​ బ్యాలెట్ల సేవలు ఎక్కువ మంది వినియోగిస్తే.. అవి లెక్కింపు​ సమయానికి చేరుతాయా? లేవా? అనే ఆందోళనల మధ్య ప్రభుత్వం ఈ సదుపాయాలు కల్పిస్తోంది. కెంటకీ, వెర్​మౌంట్​ ప్రాంతాల్లో పెళ్లి వేడుకల్లా బహిరంగ ప్రదేశాల్లో టెంట్​లు వేసి ఓటింగ్​కు ఏర్పాట్లు చేయనున్నారు. ఎన్​బీఏ ఎరీనాల్లోనూ ఓటింగ్​కు అవకాశం ఇవ్వనున్నారు. ఎక్కువ మంది ఓటర్లు వస్తే.. క్యూలో భౌతిక దూరం పాటిస్తూ నిల్చునేందుకు ప్రత్యేకంగా మార్కింగ్​ చేయనున్నారు.

భౌతిక దూరం, మాస్కు ధరించడం వల్ల వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అయితే చలికాలం కావడం వల్ల ప్రజలు బయటకు వస్తారా? అనేది ప్రశ్నార్థకం. దీని వల్ల సంప్రదాయ పోలింగ్​కు ఓటర్లు తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

మెయిల్​-ఇన్​ ఓటింగ్​..

ఎన్నికల రోజున మెయిల్-ఇన్ ఓటింగ్‌లో పెరుగుదల వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ అవకాశాన్ని​ ఎక్కువ మంది వినియోగించుకుంటే.. పోస్టల్​ విభాగానికి తిప్పలు తప్పవని, కౌంటింగ్​ సమయానికి బ్యాలెట్లు చేరడం కష్టమని అంటున్నారు.

వీటన్నింటి వల్ల ప్రత్యక్షంగా ఓటు​ వేయాలనుకునే వారూ పెరుగుతున్నారట. ఇప్పటికే ట్రంప్​ కూడా మెయిల్​-ఇన్​ ఓటింగ్​పై అవినీతి ఆరోపణలు చేశారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పూర్తిగా మెయిల్​-ఇన్​తోనే ఎన్నికలు నిర్వహించనున్నారు.

జూన్​లో యూటా రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటం వల్ల పోలింగ్​ కేంద్రాలు తెరవలేదు. అయితే నవంబర్​ ఎన్నికల్లో మాత్రం వాటిని అందుబాటులోకి తేనున్నారు. స్కూళ్లు, చర్చిలు, ప్రభుత్వ భవనాల్లో పోలింగ్​ ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రైవ్​ థ్రూ, ఔట్​ డోర్​ పోలింగ్​ విధానంలోనూ ఓటింగ్​కు అవకాశం కల్పిస్తున్నారు.

కార్లలో వచ్చి ఓటింగ్​(డ్రైవ్​ థ్రూ)..

సబర్బన్​ సాల్ట్​ లేక్​ సిటీలో... ఇండోర్​ కన్వెన్షన్​ సెంటర్​లో 'డ్రైవ్​ థ్రూ' పోలింగ్​కు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని ద్వారా కాలు కారులోంచి కింద పెట్టకుండానే ఓటు వేసి వెళ్లిపోవచ్చు. తొలుత కేంద్రంలోకి ప్రవేశించే ముందు బ్యాలెట్​ను అందజేస్తారు. కారులో కూర్చొనే వాటిలో వివరాలు నింపి.. ఔట్​డోర్​ పార్కింగ్​లో ఏర్పాటు చేసిన బాక్సుల్లో దాన్ని డ్రాప్​ చేయాల్సి ఉంటుంది. లాస్​ ఏంజిల్స్​లోనూ డాడ్గర్​ స్టేడియాన్ని పోలింగ్​ కేంద్రంగా ఉపయోగించనున్నారు. ఎన్​బీఏ స్టేడియాల్లో పలువురు ఆటగాళ్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

నవంబర్​ 3న జరగనున్న ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్​ అభ్యర్థి ట్రంప్​, ప్రత్యర్థిగా డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్​ పోటీపడనున్నారు. ఇప్పటికే ఇద్దరూ హోరాహోరీగా ప్రచారాల్లో బిజీగా ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.