ETV Bharat / international

మానవసహితంగా తొలిసారి 'హైపర్​లూప్'​ ప్రయోగం

రవాణా వ్యవస్థలో సరికొత్త మార్పులు తెచ్చే 'హైపర్​లూప్​' ప్రయోగంలో మరో ముందడుగు పడింది. తొలిసారి మానవులతో ఈ హైపర్​లూప్​ పాడ్​ విజయవంతంగా దూసుకెళ్లింది. కేవలం 15 సెకన్లలో 172 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకుంది.

Virgin Hyperloop
మానవసహితంగా 'హైపర్​లూప్'​ ప్రయోగం
author img

By

Published : Nov 10, 2020, 7:14 AM IST

వాణిజ్య విమానాల స్థాయి వేగంతో నేలపైనే ప్రయాణించే రోజు రాబోతోంది. వినూత్న హైపర్​లూప్​ రావాణా వ్యవస్థను సాకారం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. మనుషులను కూర్చోబెట్టి తొలిసారిగా నిర్వహించిన ప్రయోగం విజయవంతమైంది. అమెరికాలోని లాస్​ వెగాస్​లో ఉన్న డెవ్​లూప్​ ప్రయోగ కేంద్రంలో సోమవారం ఈ పరీక్ష జరిగింది.

Virgin Hyperloop
హైపల్​లూప్​ పాడ్​లో కూర్చున్న జోష్​, శారా

వర్జిన్​ హైపర్​లూప్​ సంస్థ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా సంస్థ అధికారులు జోష్​ జీగెల్​, సారా లుచియాన్​లు కొత్తగా ఆవిష్కరించిన ఎక్స్​పీ-2 హైపర్​లూప్​ పాడ్​లో ప్రయాణించారు. ఆ వాహనం 15 సెకన్లలో 500 మీటర్లు దూసుకెళ్లింది. ఈ క్రమంలో గంటకు 172 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకుంది. ప్రయాణికుల సౌకర్యం, భద్రతను దృష్టిలో పెట్టుకొని ఎక్స్​పీ-2 పాడ్​ను ప్రత్యేకంగా రూపొందించారు.

Virgin Hyperloop
హైపర్​లూప్​ లోపలి భాగం

హైపర్​లూప్​ పాడ్​ను మానవులు లేకుండా దాదాపు 400 సార్లు పరీక్షించారు. తాజాగా ప్రయోగాన్ని స్వతంత్ర భద్రతా విశ్లేషకులు పరిశీలించారు. తదుపరి కూడా మానవ సహిత ప్రయోగాలు జరుగుతాయని వర్జిన్​ సంస్థ తెలిపింది. ఈసారి జరిగే ప్రయాణంలో వర్జిన్​ హైపర్​లూప్​ పవర్​ ఎలక్ట్రానిక్స్​ నిపుణుడు తనయ్​ మంజ్రేకర్​ పాల్గొంటారు. ఆయన స్వస్థలం పుణె.

Virgin Hyperloop
అమెరికాలోని లాస్​ వెగాస్​లో ఉన్న డెవ్​లూప్​ ప్రయోగ కేంద్రం

ఏమిటీ హైపర్​లూప్​..?

హైపర్​లూప్​ అనేది కొత్త తరం రవాణా వ్యవస్థ. దీని ద్వారా గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు. అందులో మైట్రోరైలు బోగీల్లా ఉండే పాడ్​లు లేదా క్యాప్స్యూల్స్​ ఉంటాయి. తక్కువ పీడనం ఉన్న గొట్టాల్లో ఇవి పయనిస్తాయి. హైపర్​లూప్​ వ్యవస్థలను స్తంభాలపై కానీ భూగర్భంలో కానీ ఏర్పాటు చేయవచ్చు. ఈ వ్యవస్థ మొత్తం స్వయంచోదితం. డ్రైవర్​ సంబంధ పొరపాట్లు ఉండవు.

Virgin Hyperloop
ప్రయోగంలో భాగమైన జోష్​, శారా

భారత్​కు ప్రయోజనం..

భారత్​లోనూ హైపర్​లూప్​ ప్రయాణ వ్యవస్థ సాకారం కోసం కసరత్తు జరుగుతోంది. తాజా ప్రయోగం విజయవంతం కావడం.. ఈ ప్రాజెక్టులకు శుభవార్త అని వర్జిన్​ హైపర్​లూప్​ పేర్కొంది.

"ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇది భారత్​లోనే సాకారం కావొచ్చు. పుణెను ముంబయితో అనుసంధానించేందుకు ప్రస్తుతమున్న ఎక్స్​ప్రైస్​ హైవే పక్కనే హైపర్​లూప్​ మార్గాన్ని ఏర్పాటు చేస్తాం" అని వర్జిన్​ హైపర్​లూప్​ ఎండీ హర్జ్​ ధలివాల్​ పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.