ETV Bharat / international

ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురు దుర్మరణం - కారు ప్రమాదం

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. కారు రెండు ముక్కలైంది. మృతుల్లోని నలుగురు ఇటీవలే గ్రాడ్యుయేషన్​​ పూర్తి చేశారు.

violent-crash-kills-5-splits-vehicle-in-half-in-yonkers
అమెరికాలో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి
author img

By

Published : Dec 23, 2020, 10:59 PM IST

అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి మరో కారును ఢీకొట్టింది. కారులోని నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో వాహనంలోని డ్రైవర్​ చనిపోయాడు. కారు రెండు ముక్కలైంది. ఈ దుర్ఘటన యాంకర్స్​లోని రివిడేల్​ అవెన్యూ సమీపంలో మంగళవారం(అమెరికా కాలమానం ప్రకారం) రాత్రి జరిగింది. చనిపోయిన నలుగురు ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

ప్రమాదం జరిగిన ప్రాంతమంతా పగిలిన కారు ముక్కలతో, రక్తపు మరకలతో నిండిపోయింది. 8 గంటల పాటు ఆ ప్రాంతంలో రాకపోకలను నిలిపివేశారు అధికారులు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు దగ్గర్లోని గ్యాస్​ బంక్​ సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

ఇదీ చూడండి: మహానగరం రక్తసిక్తం.. ప్రమాదాలకు నిర్లక్ష్యమే కారణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.