అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌నకు మద్దతుగా ఎన్నికల ఫలితాలపై రాజధాని వాషింగ్టన్లో చేపట్టిన 'మిలియన్ మెగా మార్చ్' ర్యాలీ హంసాత్మకంగా మారింది. ట్రంప్ మద్దతుదారులు, నిరసనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు పరస్పరం దాడికి దిగాయి.
'చీకటి పడటం వల్ల నిరసనలు మరింత ఊపందుకున్నాయి. ట్రంప్ న్యాయవాదులను వేధించడం, ఎర్రటోపీలు, జెండాలను దొంగిలించి... వాటికి నిప్పంచడం వంటి ట్రంప్ వ్యతిరేకవాదుల రెచ్చగొట్టే చర్యలు గొడవలకు దారి తీశాయి' అని వాషింగ్టన్ పోస్ట్ వార్తా సంస్థ పేర్కొంది.
'శ్వేతసౌధం సమీపంలోని ఫ్రీడమ్ ప్లాజా వద్ద ట్రంప్‌నకు మద్దతుగా ర్యాలీలు కొనసాగుతుండగా... ఆయనను వ్యతిరేకించే నిరసనకారుల సమూహం అక్కడికి చేరుకుంది. దీంతో ట్రంప్ మద్దతుదారులు చుట్టుముట్టి యూఎస్ఏ! యూఎస్ఏ! అంటూ నినాదాలు చేశారు. దీంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి' అని వార్తా సంస్థ తెలిపింది.
ఈ ఘర్షణలో ఇరువర్గాల్లోని పలువురు గాయపడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపు చేసి... 10మందిని అరెస్టు చేశారు.
ఇదీ చూడండి: 'నిజమే.. అల్‌ఖైదా నెం.2 హతమయ్యాడు'