ETV Bharat / international

'వాణిజ్య కార్యకలాపాల్లో కమల​ పేరు వాడొద్దు'

కమలా హారిస్​ పేరును ఎలాంటి వాణిజ్య కార్యకలాపాల్లో వాడకూడదంటూ ఆమె అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. కమలా హారిస్​ బంధువు మీనా హారిస్​.. తన కంపెనీ బ్రాండ్​ను పెంచుకునేందుకు ఉపాధ్యక్షురాలి పేరును వినియోగించారని వార్తలొచ్చిన నేపథ్యంలో ఈ మేరకు ప్రకటించారు.

Vice President Kamala Harris' name should not be used for any commercial activity
'వాణిజ్య కార్యకలాపాల్లో కమలా హారిస్​ పేరు వాడొద్దు'
author img

By

Published : Feb 18, 2021, 12:54 PM IST

Updated : Feb 18, 2021, 1:24 PM IST

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరును.. ఎలాంటి వాణిజ్య కార్యకలాపాల్లోనూ ఉపయోగించరాదని ఆమె అధికార ప్రతినిధి సబారినా సింగ్​ తెలిపారు. శ్వేతసౌధం.. హారిస్​, ఆమె కుటుంబ సభ్యులు అత్యున్నత నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని ఆమె అన్నారు. ఇలాంటి సందర్భంలో వారి పేర్లను వినియోగిస్తే.. దాన్ని దుర్వినియోగం చేసినట్లవుతుందని పేర్కొన్నారు.

ఇటీవల కమల​ బంధువు మీనా హారిస్​.. తన ప్రతిష్ఠను పెంచుకునేందుకు తన కంపెనీ వస్త్రాలపై 'వైస్​ ప్రెసిడెంట్​ ఆంటీ' అని ముద్రించుకున్నారు. దీనిని శ్వేతసౌధం వ్యతిరేకించినట్టు.. కమల పేరును ఉపయోగించవద్దని స్పష్టం చేసినట్టు రిపోర్టులు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.

"ఉపాధ్యక్షురాలు, ఆమె కుటుంబం శ్వేతసౌధం పరంగా అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉంటారు. ఈ క్రమంలో సొంత బ్రాండ్​ను పెంచుకునేందుకు వారి పేర్లను, మద్దతును ఎలాంటి వాణిజ్య కార్యకలాపాల్లో ఉపయోగించకూడదు."

- సబారినా సింగ్​, కమలా హారిస్​ డిప్యూటీ ప్రెస్​ సెక్రటరీ

ఇదీ చదవండి: కమల బంధువుకు శ్వేతసౌధం వార్నింగ్!

అగ్రరాజ్య ఉపాధ్యక్ష పదవిలో ఉన్న కమలా హారిస్​ పరపతిని ఆమె మేనకోడలు మీనా హారిస్​ వాడుకోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో శ్వేతసౌధ న్యాయవాదులు వ్యాపార నిమిత్తం ఆమెకు పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది.

అయితే.. ఎన్నికల ప్రచారం నాటి నుంచి అన్ని న్యాయ, నైతికపరమైన నియమాలను తాను అనుసరిస్తున్నానని మీనా హారిస్‌ చెప్పినట్టు సమాచారం. అంతేకాకుండా ఉపాధ్యక్షురాలికి సంబంధించినవి, ఆమెను పోలిన చిహ్నాలు, పేర్లను తమ వెబ్‌సైట్‌ నుంచి తొలగించినట్లు కూడా ఆమె వివరించారు. ఇకపై కూడా కమలా హారిస్‌ పేరును తమ వస్తువుల ప్రచారంలోకి వాడబోమని ఆమె స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: విల్లాయే జైలు.. యువరాణి బందీ!

Last Updated : Feb 18, 2021, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.