దేశ జనాభాను పెంచేందుకు ప్రతి మహిళ ఆరుగురు పిల్లలకు జన్మనివ్వాలని వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో సూచించారు. ఆర్థిక సంక్షోభం కారణంగా ఇటీవల వెనిజువెలా నుంచి లక్షలాది మంది ప్రజలు వేరే దేశాలకు పారిపోతున్నారు. దీనివల్ల దేశ జనాభా గణనీయంగా తగ్గింది. జనన పద్ధతులకు ప్రోత్సహించే ప్రభుత్వ కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన మదురో.... ఈ సూచన చేశారు.
జనన పద్ధతులకు ప్రోత్సహించే ప్రభుత్వ కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన మదురో.. ఈ సూచన చేశారు. దేశానికి ఆరుగురు శిశువులను అందించేలా మహిళలను దేవుడు ఆశీర్వదిస్తాడని వెనిజువెలా అధ్యక్షుడు అన్నారు. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం 2015 నుంచి ఇప్పటి వరకూ సుమారు 45 లక్షల మంది ప్రజలు వెనిజువెలా నుంచి వలస వెళ్లారు.
విమర్శలు..
వెనిజువెలా అధ్యక్షుడి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆ దేశంలో ప్రాథమిక అవసరాలు తీర్చుకోలేక లక్షలాది మంది తీవ్ర అవస్థలు పడుతున్న వేళ.. జనాభా పెంపునకు పిలుపునివ్వడం బాధ్యతారాహిత్యమని మానవ హక్కుల కార్యకర్తలు విమర్శించారు. దేశ జనాభాలో మూడింట ఒక వంతు మంది తమ ప్రాథమిక ఆహార అవసరాలను తీర్చలేకపోతున్నారు.
ఇదీ చూడండి:భారత్లో కరోనాను ఎదుర్కొనేందుకు చైనా వైద్యుల సలహాలు