ప్రముఖ భారతీయ-అమెరికన్ నవలా రచయిత వేద్ మెహతా ఇకలేరు. చిన్నతనంలోనే చూపు కోల్పోయినా.. అంధత్వాన్ని అధిగమిస్తూ అనేక రచనలు, వందలాది వ్యాసాలు రాసిన 86ఏళ్ల మెహతా.. శనివారం కన్ను మూశారు.

నేపథ్యం:
1934లో లాహోర్(ప్రస్తుత పాకిస్థాన్ నగరం)లో జన్మించిన మెహతా.. బ్రిటన్, అమెరికాలో విద్యనభ్యసించారు. ఈ క్రమంలో అమెరికాలోనే స్థిరపడి అక్కడి పౌరసత్వం పొందారు. మూడేళ్లకే కనుచూపు కోల్పోయిన మెహతా.. తన రచనలతో సాహిత్య కాంతిని వెలిగించారు. 33 సంవత్సరాలు స్టాఫ్ రైటర్‌గా పనిచేసిన ఆయన.. ఎన్నో ప్రసిద్ధ రచనలతో గొప్ప రచయితగా పేరుపొందారు. సమకాలీన అమెరికన్లకు తన పుస్తకాల ద్వారా భారతదేశాన్ని పరిచయం చేశారు. 20వ శతాబ్దానికి చెందిన ఈ రచయిత.. అమెరికన్ రచయిత జేమ్స్ ఫెనిమోర్ కూపర్ వారసురాలైరన లిన్న్ కేరీని వివాహం చేసుకున్నారు.
రచనలు:
మోహతా రచించిన మొట్టమొదటి పుస్తకం 'ఫేస్ టూ ఫేస్'. ఇది 1957లో ప్రచురితమై.. ఎందరో సాహిత్య ప్రముఖుల దృష్టిని ఆకర్షంచింది. ఆ తర్వాత తన తండ్రి అమోలక్ రామ్ మెహతా గురించి 'డాడీజీ', స్వీయకథతో 'కాంటినెంట్స్ ఆఫ్ ఎక్సైల్' వంటి ప్రసిద్ధ రచనలు చేశారు. భారత పర్యటనపై ఆయన రాసిన ఓ వ్యాసం 1960లో న్యూయార్కర్ మ్యాగజైన్లో ప్రచురితమైంది. దీంతో ఆ సంపాదకులు విలియం షాన్.. మెహతాను స్టాఫ్ రైటర్‌గా నియమించుకున్నారు. ఆయన రాసిన అనేక పుస్తకాలు.. న్యూయార్కర్‌లో సుదీర్ఘ కాలంపాటు వ్యాసాలుగా ప్రచురితమయ్యాయి.
అయితే.. 1994 టీనా బ్రౌన్ సంపాదకులుగా బాధ్యతలు చేపట్టాక.. 36 ఏళ్ల స్టాఫ్ రైటర్ కెరీర్‌కు ముగింపు పలికారు మెహతా. ఆ తర్వాత కూడా పుస్తకాలు రాస్తూనే యేల్, న్యూయార్క్ విశ్వవిద్యాలయాలో అధ్యాపకులుగా సేవలందించారు. మెహతా రచనల్లో ప్రజల జీవన విధానం కళ్లకు కట్టినట్టుగా ఉంటుంది.
'ఆత్మకథ', ఇతర ప్రసిద్ధ రచనలు:
మెహతా.. స్వీయకథతో పాటు తన కుటుంబ నేపథ్యం, వలస రాజ్యాల పాలన వంటి వాటిపైనా రచనలు చేశారు. ఆయన ఆత్మకథల్లో తల్లి శాంతి గురించి రాసిన 'మామాజీ' కూడా ఒకటి. మానసిక విశ్లేషణపై రాసిన 'ఆల్ ఫర్ లవ్', అంధుల విద్యపై 'సౌండ్-షాడోస్ ఆఫ్ ది న్యూ వరల్డ్', యూకేలో విద్యనభ్యసించినప్పటి విషయాల గూర్చి.. 'అప్ ఎట్ ఆక్స్ఫర్డ్' వంటివీ ఎంతో ప్రసిద్ధి పొందాయి. 'వాకింగ్ ద ఇండియన్ స్ట్రీట్స్', 'పోర్ట్రెయిట్ ఆఫ్ ఇండియా', 'మహాత్మాగాంధీ అండ్ హిస్ అపోస్ట్లెస్' వంటి దేశీయ రచనల్ని అమెరికన్ పాఠకుల కోసం రచించారు మెహతా.
బ్రిటీష్ తత్వవేత్తలలో ఆయన ఎదుర్కొన్న 'ఫ్లై అండ్ ది ఫ్లై-బాటిల్: ఎన్కౌంటర్స్ విత్ బ్రిటీష్ ఇంటలెక్చువల్స్' అధిక ప్రభావం పొందిన పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా.. 'ద డెలిన్క్వెంట్ చాచా' అనే నవల కూడా మెహతా రచనల్లో పేరుగాంచింది.
'ఎ ఫ్యామిలీ ఎఫైర్: ఇండియా అండర్ త్రీ ప్రైమ్ మినిస్టర్స్'తో సహా.. భారత రాజకీయాలపై పలు రచనలు చేశారు మోహతా. అయితే.. ఇందులో ఇందిరాగాంధీ, నరేంద్ర మోదీలను విమర్శించారు.
ఇదీ చదవండి: నేడు దిగువ సభలో ట్రంప్‌పై అభిశంసన తీర్మానం