అమెరికా కాలిఫోర్నియాలో మంచు తుపాను బీభత్సం సృష్టించింది. సుసాన్విల్ సమీపంలోని రెనో ప్రాంతంలో మంగళవారం 10 అంగుళాల మేర మంచు కురిసింది. మైర్స్ ప్రాంతంలో 9.5 అంగుళాల హిమపాతం నమోదైంది.
మంచు తుపాను ధాటికి రహదారులపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. మంగళవారం ఒక్కరోజే రెనో-స్పార్క్స్ ప్రాంతంలో 10కిపైగా వాహన ప్రమాదాలు జరిగాయి. అనేక చోట్ల ట్రాఫిక్ స్తంభించింది.
ఇదీ చదవండి: వేర్వేరు వయసుల పిల్లల్లో మధుమేహం వ్యత్యాసం ఇలా..