ETV Bharat / international

టీకా నిల్వలతోనే కరోనా కొనసాగింపు.. డబ్ల్యూహెచ్​ఓ హెచ్చరిక

vaccine hoarding who: ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు కరోనా టీకాలు పూర్తి స్థాయిలో పంపిణీ అయితేనే కరోనాపై విజయం సాధ్యమని డబ్ల్యూహెచ్​ఓ పునరుద్ఘాటించింది. సంపన్న దేశాల టీకా నిల్వలు కరోనా కొనసాగింపునకు కారణమని హెచ్చరించింది.

vaccine hoarding who
డబ్ల్యూహెచ్​ఓ
author img

By

Published : Dec 10, 2021, 4:32 AM IST

Updated : Dec 10, 2021, 6:26 AM IST

vaccine hoarding: కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు కరోనా టీకాలు పూర్తి స్థాయిలో పంపిణీ అయితేనే వైరస్​పై విజయం సాధ్యమని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. సంపన్న దేశాల టీకా నిల్వలు కరోనా కొనసాగింపునకు కారణమని హెచ్చరించింది. ఒమిక్రాన్​పై ప్రస్తుతం ఉన్న టీకాలు పనిచేస్తాయని లాబొరేటరీ డేటా తెలుపుతున్నప్పటికీ వ్యాధి తీవ్రంగా ఉన్నవారిపై ఎంతమేరకు పనిచేస్తాయో తెలియదని స్పష్టం చేసింది.

ప్రపంచం ఇంకా హెర్డ్​ ఇమ్యునిటీని సాధించలేకపోయిందని డబ్ల్యూహెచ్​ఓకు చెందిన ఇమ్యూనైజేషన్​ డిపార్ట్​మెంట్​ డైరెక్టర్​ డా.కాటె ఒబ్రెయిన్​ అన్నారు. అన్ని దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ సమాన స్థాయిలో జరగకపోవడమే దీనికి కారణమని చెప్పారు. 'ధనిక దేశాలు వ్యాక్సిన్ డ్రైవ్​లతో భారీగా టీకాలను ప్రజలకు పంపిణీ చేశాయి. కానీ పేద దేశాలు టీకా కొరతతో తమ పౌరులకు వ్యాక్సిన్​ను అందించలేకపోయాయి. దీని కారణంగానే కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. టీకా వేసుకోనివారికి ఇది ప్రమాదకరంగా మారుతుంది.' అని స్పష్టం చేశారు.

omicron cases in uk..

బ్రిటన్​లో కేవలం ఒక్క రోజులోనే రెండు రెట్లు ఒమిక్రాన్ కేసులు పెరిగాయి. బుధవారం 249గా ఉన్న ఒమిక్రాన్​ కేసులు గురువారం నాటికి 817కి ఎగబాకాయని యూకే ఆరోగ్య విభాగం వెల్లడించింది. వచ్చే నాలుగు వారాల్లో నమోదయ్యే కరోనా కేసుల్లో 50 శాతం ఒమిక్రాన్​ వేరియంట్​కు సంబంధించినవే ఉండనున్నాయని తెలిపింది. ఊహించిన దానికంటే వేగంగా ఈ వేరియంట్​ వ్యాపిస్తోందని పేర్కొంది. దీనిని ఎదుర్కొనడానికి టీకాలు వేసుకోవడం తప్పనిసరని స్పష్టం చేసింది.

omicron cases malawi​..

ఆఫ్రికా దేశమైన మలావీలో ఒమిక్రాన్​ వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయి. తొలిసారిగా 3 ఒమిక్రాన్ కేసులు బయటపడినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నిబంధనలు కఠినతరం చేస్తున్నట్లు పేర్కొంది. పర్యటకులకు 72 గంటల ముందు కరోనా నెగెటివ్​ రిపోర్ట్​ను తప్పనిసరి చేసింది.

ఇదీ చదవండి:57 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్​.. డబ్ల్యూహెచ్​ఓ హై అలర్ట్​

Sotrovimab omicron: 'ఈ ఔషధంతో 'ఒమిక్రాన్‌' ఖేల్ ఖతం!'

Last Updated : Dec 10, 2021, 6:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.